Nikhil Siddhartha : నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అంటున్న నిఖిల్.. రామ్ చరణ్ అనుకుంటున్నారా..?

నిఖిల్ సిద్దార్థ్, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ హీరో నిజమైన 'గేమ్ ఛేంజర్' అంటూ ఒక ట్వీట్ చేశాడు. గేమ్ ఛేంజర్ అంటే రామ్ చరణ్ అనుకుంటున్నారేమో..

Nikhil Siddhartha : నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అంటున్న నిఖిల్.. రామ్ చరణ్ అనుకుంటున్నారా..?

Swayambhu star Nikhil Siddhartha tweeted real game changer is him

Updated On : October 22, 2023 / 6:01 AM IST

Nikhil Siddhartha : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్.. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో ‘స్వయంభు’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నిర్మాణంలో ‘ది ఇండియా హౌస్’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నాయి. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో తన ట్విట్టర్‌లో.. నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అంటూ ఒక ట్వీట్ చేశాడు. గేమ్ ఛేంజర్ అంటే రామ్ చరణ్ అనుకుంటున్నారేమో అసలు కాదు. మరి ఎవరి గురించో తెలుసా..?

కార్తికేయ 2 సక్సెస్ తో నిఖిల్ మంచి స్టార్‌డమ్ ని సంపాదించుకున్నాడు. దీంతో నిఖిల్ పలు సంస్థలు తమ కొత్త బ్రాండ్స్ ని లాంచ్ చేయించడానికి ఉత్సాహ పడుతున్నారు. ఈక్రమంలోనే Acer సంస్థ తమ కొత్త ఎలెక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. ఈ బైక్ ని నిఖిల్ చేతుల మీదుగా మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇక దీని గురించి మాట్లాడుతూనే నిఖిల్ ట్వీట్ చేశాడు. శాశ్వత పవర్ కలిగి ఉండే ఈ బైక్ నిజమైన గేమ్ ఛేంజర్ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : LEO : లియో నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రూ.1000 కోట్లు రావు.. రెండు ల‌క్ష‌ల మంది ప‌క్క రాష్ట్రాల‌కు..

ఇక నిఖిల్, రామ్ చరణ్ తో చేయబోయే ‘ది ఇండియా హౌస్’ సినిమా విషయానికే వస్తే.. ఈ మూవీ స్వాతంత్ర పోరాట కాలంనాటి కథతో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు దేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటాలే అన్ని సినిమాలో చూస్తూ వచ్చాము. అయితే ఈ సినిమాతో దేశం బయట, బ్రిటిష్ గడ్డ పై జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని మేకర్స్ చూపించబోతున్నారు. రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకోని, వాటి చుట్టూ ఒక ఫిక్షనల్ స్టోరీ అల్లుకొని ఈ సినిమాని భారీ స్కేల్ లో తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.