Bigg Boss Tasty Teja : బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే తేజ స్పెషల్ ఇంటర్వ్యూ.. ఏకంగా బిగ్‌బాస్ హోస్ట్ నే..

ఇటీవల వచ్చే చాలా సినిమాలు టేస్టీ తేజ ఛానల్ లో ఓ రెస్టారెంట్ లో అతనితో కలిసి ఫుడ్ తింటూ తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాయి.

Bigg Boss Tasty Teja : బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే తేజ స్పెషల్ ఇంటర్వ్యూ.. ఏకంగా బిగ్‌బాస్ హోస్ట్ నే..

Tasty Teja first Interview with Nani for His Channel after came out from Bigg Boss 7

Updated On : November 11, 2023 / 5:00 PM IST

Bigg Boss Tasty Teja : బిగ్‌బాస్ సీజన్ 7లో ఆర్టిస్ట్, ఫుడ్ వ్లాగర్(Food Vlogger) టేస్టీ తేజ(Tasty Teja) పాల్గొని ఇటీవల ఎలిమినేట్ అయి బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టిన తేజ ఆ తర్వాత నటుడిగా మారి జబర్దస్త్ లో పలు స్కిట్స్ లో కనిపించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో టేస్టీ తేజ అనే ఒక ఫుడ్ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఫుడ్ వ్లాగర్ గా మారాడు.

మొదట తనే వివిధ రెస్టారెంట్స్ కి వెళ్లి అక్కడి ఫుడ్ గురించి వీడియోలు తీశాడు. ఈ ఛానల్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు, సినిమా వాళ్లంతా తమ ప్రమోషన్స్ కోసం టేస్టీ తేజ వెనక పడుతున్నారు. ఇటీవల వచ్చే చాలా సినిమాలు టేస్టీ తేజ ఛానల్ లో ఓ రెస్టారెంట్ లో అతనితో కలిసి ఫుడ్ తింటూ తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాయి.

Also Read : Niharika Konidela : కొత్త సినిమా ఓపెనింగ్‌లో.. చీరలో అలరించిన నిహారిక..

బిగ్‌బాస్ నుంచి వచ్చాక మళ్ళీ తన టేస్టీ తేజ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. తాజాగా హీరో నానితోనే(Nani) ఫుడ్ తింటూ ఇంటర్వ్యూ చేశాడు తేజ. నాని బిగ్‌బాస్ సీజన్ 2కి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తేజ ఇటీవలే బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చి గతంలో బిగ్‌బాస్ హోస్ట్ చేసిన నాని ఇంటర్వ్యూ తీసుకోవడం వైరల్ గా మారింది. హాయ్ నాన్న(Hi Nanna) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని టేస్టీ తేజతో కలిసి ఫుడ్ తింటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. చిత్రయూనిట్ ఫొటోలు షేర్ చేయగా త్వరలోనే ఈ ఇంటర్వ్యూ బయటకు రానుంది. తేజ బయటకి రాగానే ఏకంగా నానితో ఇంటర్వ్యూ చేశాడని తేజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.