Tejaswi Madivada : మొదటిసారి బికినీ వేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.. తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రైలర్ లో తేజస్వి బికినీ వేసుకున్న సీన్ ఉంది. ఇటీవలే ఆ సీన్ లో బికినీతో ఉన్న ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Tejaswi Madivada Interesting Comments on Wearing Bikini in Ardhamaindha arun kumar Web Series Season 2
Tejaswi Madivada : తెలుగమ్మాయి తేజస్వి మడివాడ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ బాలీవుడ్ షోలో కూడా పాల్గొని హాట్ గా కనిపించి అలరించింది. తేజస్వి త్వరలో అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసారు.
అయితే ట్రైలర్ లో తేజస్వి బికినీ వేసుకున్న సీన్ ఉంది. ఇటీవలే ఆ సీన్ లో బికినీతో ఉన్న ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తేజస్విని బికినీ వేయడంపై ఓ యూట్యూబ్ యాంకర్ ఆ బికినీలో పర్ఫెక్ట్ గా కనిపించడానికి ఫిట్నెస్ జర్నీ ఏమైనా చేసారా అని ప్రశ్నించగా దాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తేజస్వి మాట్లాడుతూ.. ఆర్మీ సినిమాలకు, మేరీకోమ్ లాంటి సినిమాలకే కష్టపడి బాడీ పెంచాలి, మిగిలిన వాటికి అవసర్లేదు అని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి యాక్టర్ కి అందంగా ఉండటం, బాడీ ఫిట్ గా ఉండటం అవసరం. స్క్రీన్ లో నార్మల్ గా కంటే ఇంకా బాగా కనిపిస్తాము. చిన్న యాక్టర్ నుంచి పెద్ద స్టార్స్ వరకు అందరూ కష్టపడతారు. నాకు మొదటి సారి అవకాశం వచ్చింది నేనేంటో చూపించడానికి. స్క్రిప్ట్ నేను రాయలేదు, వాళ్ళు నాకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అప్పటికే నేను ఫిట్నెస్ జర్నీలో ఉన్నాను. ఏదైనా డ్రెస్ వేసుకుంటే బాగుండాలి, వేసుకున్న తర్వాత ఛీ నేను ఇలా ఉన్నాను ఏంటి అని ఓ పదేళ్ల తర్వాత నేను అనుకోకూడదు. తెలుగు సినిమాలో మొదటిసారి నేను బికినీ వేసుకున్నాను. నేను ఇది ఒక గొప్ప అవకాశంలా భావిస్తున్నాను. నా కష్టం చూపించాను అనిపిస్తుంది. అంత ఫిట్ గా ఉన్నాము అంటే నా క్రమశిక్షణ తెలుస్తుంది. ఈ సిరీస్ లో నా క్రమశిక్షణ చూపించే అవకాశం వచ్చింది. అయినా నేను ఊరికే బికినీ వేసుకొని రోడ్ల మీద తిరగట్లేదు. సినిమాలో సన్నివేశం కోసం చేశాను అని తెలిపింది. దీంతో తేజస్విని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.