Kousalya Tanaya Raghava : 1980 ప్రేమకథతో రాబోతున్న కౌసల్య తనయ రాఘవ..
1980 నేపథ్యంతో ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ 'కౌసల్య తనయ రాఘవ' ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Telugu new love story movie Kousalya Tanaya Raghava
Kousalya Tanaya Raghava : రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరోహీరోయిన్స్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ మూవీ ‘కౌసల్య తనయ రాఘవ’. స్వామి పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం ప్రేమకథా చిత్రం గానే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెడుతున్నారు.
Also read : War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా.. నిజమేనా..!
మనిషికి మనిషి మధ్య ఉండే విలువలు, మనసుకి మనసు మధ్య ఉండే ప్రేమ గురించి 1980 నేపథ్యంతో ఈ సినిమాలో అందంగా చూపించబోతున్నారు. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాజేష్ రాజ్ తేలు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామంటూ మేకర్స్ వెల్లడించారు.