Siddharth: సమంతపై ట్వీట్ కాదు.. సిద్ధార్థ్ క్లారిటీ.. కుక్కలతో పోలుస్తూ!
సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్విట్ దక్షిణాదిలో హాట్ టాపిక్ అయ్యింది.
Siddharth: సమంత, సిద్ధార్థ్ మధ్య బంధం ఏంటో ఎవరికీ క్లారిటీ లేదు కానీ, లేటెస్ట్గా సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్విట్ దక్షిణాదిలో హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడూ కూడా సిద్ధార్థ్ స్ట్రైట్‌గా విషయాలని చెబుతూ ఉంటారు. ఆరోజు కూడా సమంత గురించే అని అందరూ అనుకున్నారు.
అయితే, లేటెస్ట్గా తన ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చారు సిద్ధార్థ్. “మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అంటూ చేసిన ట్వీట్ సమంత గురించి కాదని, సమంత పేరును ట్వీట్లో ఎక్కడైనా పెట్టానా? అని ప్రశ్నించారు. నేను ఎవరి గురించి ట్వీట్ చేయలేదు. నా జీవితంలో జరిగిందే ట్వీట్ చేశానని చెప్పారు.
తాను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి రోజు ట్వీట్ చేసినట్లే, ఆరోజు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఇంటి బయట కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ వేస్తే.. ఎవరోవచ్చి నన్ను కుక్క అంటావా? అని అంటే తానేమీ చేయలేనన్నారు. సమంత విడిపోయినట్లు ప్రకటించిన రోజే ఎందుకు అలా చేశారని యాంకర్ అడగగా.. వేరే వాళ్ల గురించి నా దగ్గర ప్రస్తావివంచొద్దు అని అన్నారు.