Family Star : ఎన్టీఆర్ ‘దేవర’ బదులు దేవరకొండ వస్తున్నాడు.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్..
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతోంది. మరి అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 'దేవర' ఫస్ట్ పార్టు పోస్టు పోన్ అయినట్లేనా?

Family Star
Family Star : విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిని బట్టి ఎన్టీఆర్ ‘దేవర’ పోస్టు పోన్ అయినట్లేనా?
Poonam Pandey : బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే కన్నుమూత
‘గీత గోవిందం’ సినిమాతో డైరెక్టర్ పరశురామ్ విజయ్‌కి మంచి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కాంబోలో వస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Game On : ‘గేమ్ ఆన్’ మూవీ రివ్యూ.. ఎమోషన్స్‌తో ఆడే సైకాలజీ గేమ్ థ్రిల్లర్..
ఫ్యామిలీ స్టార్ మూవీ నిజానికి సంక్రాంతికి విడుదల కావాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పండక్కి రాలేకపోయింది. ఆ తర్వాత ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ చేయాలనుకున్నా అదే డేట్‌లో ఎన్టీఆర్ ‘దేవర’ మొదటి పార్ట్ రిలీజ్ చేస్తామని ఆ సినిమా టీమ్ ప్రకటించారు. దాంతో ఫ్యామిలీ స్టార్ వెనక్కి తగ్గింది. దేవర వాయిదా పడితే అదే డేట్‌కి ఫ్యామిలీ స్టార్ తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేసారు. అనుకున్నట్లే ఏప్రిల్ 5 కి ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని బట్టి ‘దేవర’ వాయిదా పడినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యమవడంతో దేవర ఏప్రియల్ రిలీజ్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ రిలీజ్ వార్తతో విజయ్ దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
A blockbuster entertainment bonanza is on its way! ??
????? ???, ???? is your date to welcome our #FamilyStar into your hearts ♥️#FamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/7O69QIFQcn
— Sri Venkateswara Creations (@SVC_official) February 2, 2024