ఫోటోలు చెప్పిన ప్రేమాయణం: బాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెటర్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ డేటింగ్‌లో ఉన్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కేఎల్ రాహుల్ ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో కేఎల్ రాహుల్ దిగిన ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సాగుతున్న పుకార్లు మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి.
ఈ మేరకు బాలీవుడ్ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. కేఎల్ రాహుల్‌తో అతియా శెట్టి క్లోజ్‌గా దిగిన ఫోటోలు వాటికి యాడ్ చెయ్యడంతో గాసిప్స్‌కు మరింత బలం చేకూరుతుంది. అతియా శెట్టి 2015లో సూరజ్ పాంచోలి హీరోగా తెరకెక్కిన ‘హీరో’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
కేఎల్ రాహుల్, అతియా శెట్టితో డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగుతున్నారు.
రాహుల్-అతియాల పద్దతి చూస్తే వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లే అర్థం అవుతుంది.
అతియా శెట్టి బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ ఓ పోస్ట్ చేశాడు. ఇందులో ‘హాపీ బర్త్ డే’ అని పేర్కొంటూ.. కోతి ఎమోజీని జత చేశాడు. దీనిపై స్పందించిన అతియా.. ‘లవ్’ గుర్తు ఎమోజీలను పోస్ట్ చేసింది. అప్పటి నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి.
హీరోయిన్లతో రాహుల్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌తో రాహుల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అతియా శెట్టితో మాత్రం ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్తుందంటూ టాక్ గట్టిగా వినిపిస్తుంది.