మోహన్ లాల్ థ్రిల్లర్ ‘రామ్’లో త్రిష

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో నటిస్తున్నథ్రిల్లర్ ‘రామ్’ మూవీలో కథానాయికగా త్రిష..

  • Published By: sekhar ,Published On : January 31, 2020 / 07:02 AM IST
మోహన్ లాల్ థ్రిల్లర్ ‘రామ్’లో త్రిష

Updated On : January 31, 2020 / 7:02 AM IST

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో నటిస్తున్నథ్రిల్లర్ ‘రామ్’ మూవీలో కథానాయికగా త్రిష..

చెన్నై పొన్ను త్రిష ‘లయన్’, ‘నాయకి’ సినిమాల తర్వాత తెలుగు సినిమాల్లో కనబడలేదు. తమిళ్‌లో ‘96’ తో సూపర్ డూపర్ హిట్ అందుకుని మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం మలయాళంలో ‘రామ్’ అనే సినిమా చేస్తుంది. నివీన్ పౌలితో నటించిన ‘హే జూడ్’ సినిమాతో మలయాళ పరిశ్రమకి పరిచయం అయిన త్రిష ఇప్పుడు మల్లూవుడ్‌లో తన సెకండ్ మూవీ చేస్తుంది.

Image result for hey jude movie

‘దృశ్యం’ తర్వాత కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘రామ్’ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ‘రామ్’లో త్రిష కథానాయికగా నటిస్తోంది. మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని త్రిష తెలిపింది. ఈ చిత్రంలో త్రిష డాక్టర్ క్యారెక్టర్ చేస్తుంది.

Read Also : మిస్సింగ్ కేస్ నాకివ్వండి సార్ – ఇంట్రెస్టింగ్‌గా ‘హిట్’ టీజర్

Image result for ram mohanlal movie

బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. సాయి కుమార్, దుర్గ కృష్ణన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సియారా, ఉజ్బెకిస్తాన్, యూకే, ఢిల్లీ, చెన్నై, కొలంబో అండ్ కొచ్చి వంటి వివిధ లొకేషన్లలో ‘రామ్’ షూటింగ్ జరుపనున్నారు. ఈ ఏడాది ఓనమ్ పండుగకు ‘రామ్’ విడుదల కానుంది.