RRR: కలెక్షన్ల సునామీ.. కుంభస్థలాన్ని బద్ధలు కొట్టిన ఆర్ఆర్ఆర్!

ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే బాక్సాఫీస్ లెక్కలు బయటకొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది ట్రిపుల్ ఆర్..

RRR: కలెక్షన్ల సునామీ.. కుంభస్థలాన్ని బద్ధలు కొట్టిన ఆర్ఆర్ఆర్!

RRR

Updated On : March 27, 2022 / 9:41 AM IST

RRR: ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే బాక్సాఫీస్ లెక్కలు బయటకొచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది ట్రిపుల్ ఆర్. ఓవర్సీస్ ను ఊపేస్తోంది. చాలా ఏరియాల్లో అంచనాలు రీచ్ అయినా, కొన్ని ఏరియాల్లో మాత్రం రీచ్ కాలేదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సాహో కలెక్షన్స్ ను కూడా రీచ్ కాలేదు ట్రిపుల్ ఆర్.. సో ఏఏ ఏరియాల్లో ఎంతెంత కలెక్షన్స్ రాబట్టింది? ఓవరాల్ టార్గెట్ రీచ్ అయ్యిందా లేదా? ఇలాంటి మరిన్ని వివరాలు ఫుల్ స్టోరీలో చూద్దాం.

RRR: రాజమౌళి-రామారావు-రామ్ చరణ్.. నెక్స్ట్ ఏంటి?

500 కోట్ల బడ్జెట్, 300 రోజుల సుదీర్ఘ కాలం షూటింగ్‌ జరుపుకున్నమోస్ట్ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్ ఆర్‌ ఆర్‌ఆర్‌. లార్జ్ స్కేల్ ప్రమోషన్స్ తో, హైయెస్ట్ స్క్రీన్స్ లో ఈనెల 25న రిలీజ్ అయ్యింది. తన సినిమాకు ప్రొడ్యూసర్‌ చేత ఎంత ఖర్చు చేయిస్తే అంతకన్నా ఎక్కువ బిజినెస్‌ చేసి, ప్రొడ్యూసర్‌ ను లాభాల బాట పట్టించడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. 500 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ట్రిపుల్‌ ఆర్‌ ఫస్ట్ డే కలెక్షన్స్ 150 నుంచి 170 కోట్ల షేర్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆర్ఆర్ఆర్ 257 కోట్ల గ్రాస్ వసూల్ చేసి, వరల్డ్ వైడ్ 217 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.

RRR: ఫస్ట్ డే కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్

ఏరియా వైడ్ కలెక్షన్స్ గనక పరిశీలిస్తే ఫస్ట్ డే వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120. 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో 74.11 కోట్ల షేర్ సాధించింది ఆర్ఆర్ఆర్ సినిమా. కర్ణాటకలో 16.48 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడు 12.73 కోట్లు, కేరళ 4.36 కోట్ల గ్రాస్ ను వసూళ్ చేసింది ట్రిపుల్ ఆర్. హిందీలో 19 కోట్లు కాగా హిందీ రెస్టాఫ్ ఇండియా కలుపుకుని 25.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ లో 78.25 కోట్ల గ్రాస్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా మొత్తం 257.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, అందరూ ఊహించినట్టుగానే చాలా ఏరియాల్లో ట్రిపుల్ ఆర్ ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది.

RRR: జక్కన్న కాకుంటే.. తారక్-చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండేదో?

నార్త్ లో ముందునుంచీ ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ తక్కువగానే ఉన్నాయి. కాకపోతే అక్కడ ఆడియన్స్ ను ఓన్ చేసుకోవడం కోసం నార్త్ ప్రమోషనల్ టూర్ చేసింది జక్కన్న టీమ్ అయినా జక్కన్న మాస్టర్ ప్లాన్ వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఎందుకంటే నార్త్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సౌత్ ఇండియన్ మూవీ బాహుబలి 41 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి, రికార్డ్ స్రుష్టిస్తే, సాహో 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ రెండు సినిమాలకొచ్చిన కలెక్షన్స్ ను కూడా ట్రిపుల్ ఆర్ రీచ్ కాలేదు. జస్ట్ 19 కోట్ల కలెక్షన్స్ తో నే సరిపెట్టుకోవలసి వచ్చింది. నైజాంలో ఇప్పటివరకు భీమ్లా నాయక్ 11.85 కోట్ల రూపాయల షేర్ తో రికార్డు సెట్ చేయగా ఆర్ఆర్ఆర్ 25 కోట్ల రూపాయల షేర్ తో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. నైజాం, ఏపిలో కలిపి ఇప్పటివరకు బాహుబలి 2 రికార్డు 43 కోట్ల షేర్ ఉండగా ట్రిపుల్ ఆర్ 74. 11 కోట్ల షేర్ తో ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.

RRR: బావా.. నువ్వు కుమ్మేశావ్!- అల్లు అర్జున్

కేరళ, తమిళ ఆడియన్స్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాను ఊహించినంత రేంజ్ లో ఆదరించడం లేదు. కాని, తెలుగు, కనడ, ఓవర్సీస్ లో మాత్రం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలా కొన్ని ఏరియాల్లో అందుకోలేకపోయిన అంచనాలు, మరికొన్ని ఏరియాల్లో మించి పోవడంతో ఓవరాల్ గా ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో నక్కల వేటను వదిలి, కుంబస్థలాన్ని బద్ధలు కొట్టింది. బాహుబలి 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును తిరగ రాసింది అని మెగా, నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.