Varun – Lavanya : వరుణ్, లావణ్య పెళ్లి వేదిక డెకరేషన్ చూశారా..? పెళ్లి పనులన్నీ ఉపాసన..!

వరుణ్, లావణ్య పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. పెళ్ళికి సంబంధించిన..

Varun – Lavanya : వరుణ్, లావణ్య పెళ్లి వేదిక డెకరేషన్ చూశారా..? పెళ్లి పనులన్నీ ఉపాసన..!

Upasana shares Varun Tej Lavanya Tripathi wedding venue decorations

Updated On : October 29, 2023 / 11:25 AM IST

Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇటీవల చిరు ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో స్టార్ట్ అయిన ఆ పెళ్లి సంబరం.. సందడి సందడిగా జరుగుతుంది. ఇక ఈ పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఆమె తెలియజేస్తూ వస్తున్నారు. ఇటీవల పెళ్లి వేడుక ఎక్కడ చోటు చేసుకోబోతుందో అని కూడా తెలియజేశారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈ వివాహం జరగుంది.

ఇక అక్కడ పెళ్లి వేదికకు సంబంధించిన డెకరేషన్ డిజైన్స్ ని కూడా ఉపాసన దగ్గరుండి సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని డిజైన్స్ ని ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చేశారు. వరుణ్, లావణ్య పెళ్లి వేదికకు ఈ డిజైన్స్ నే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ పోస్టు చూస్తుంటే.. ఇటలీలో అంగరంగా వైభవంగా వరుణ్, లావణ్య పెళ్లిని చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా పెళ్లి తేదీ పై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Also read : Tollywood Producer Dil Raju: దిల్ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

కాగా వరుణ్ అండ్ లావణ్య దాదాపు ఆరేళ్ళ నుంచి ప్రేమలో ఉన్నారు. మిస్ట‌ర్ సినిమాలో కలిసి నటించన వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. అది ప్రేమగా మారడం జరిగింది. మళ్ళీ అంత‌రిక్షం సినిమాలో క‌లిసి నటించే సమయానికి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వరుణ్ తేజే ముందుగా తన ప్రేమని ప్రపోజ్ చేశాడట. లావణ్య కూడా ఒకే చెప్పడంతో, ఫ్యామిలీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఏడడుగులు వేయబోతున్నారు. ఇటలీ పెళ్లి తరువాత హైదరాబాద్ లో ఒక పార్టీ నిర్వహించనున్నారని తెలుస్తుంది.