‘ఉరి..ది సర్జికల్ స్ట్రెక్’ నటుడు నవ్ తేజ్ కన్నుమూత

ముంబై: బాలీవుడ్ నటుడు నవ్‌తేజ్ హుందాల్ కన్నుమూశారు. సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం ముంబైలోని నివాసంలో నవ్‌తేజ్ హుందాల్ మృతి చెందారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘యురి..ది సర్జికల్ స్ట్రెక్’ చిత్రంలో నవ్‌తేజ్ హుందాల్ హోంమంత్రి పాత్రలో నటించారు. నవ్‌తేజ్ హుందాల్ మృతి పట్ల సినీ, టీవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ (సీఐఎన్‌టీఏఏ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నవ్‌తేజ్ కుటుంబసభ్యులకు అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
నవ్‌తేజ్‌కు భార్య అవంతిక హుందాల్, ఇద్దరు కూతుళ్లున్నారు. 1993లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ఖల్‌నాయక్, తేరే మేరే సప్నే (1996), ది విస్పరర్స్ (2009)చిత్రాల్లో నటించారు నవ్‌తేజ్. జనవరి 11న విడుదల అయిన ‘ఉరి..ది సర్జికల్ స్ట్రెక్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెసిందే.
కాశ్మీర్ యూరి సెక్టార్లలో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘యూరి-ది సర్జికల్ స్ట్రైక్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్‌హరి, మోహిత్ రైనా ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న ‘యురి..ది సర్జికల్ స్ట్రెక్’ చిత్రంలో నవ్‌తేజ్ హుందాల్ హోంమంత్రి పాత్రలో నటించారు.