రజనీకాంత్ అంటే పేరు కాదు.. ఓ ఉప్పెన

రజనీ దర్బార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేకల మధ్య ఫుల్ జోష్‌తో జరిగింది. హైదరాబాద్ లోని శిల్పారామం వేదికగా జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా తెలుగు సినిమా దర్శకులు వంశీ పైడిపల్లి, మారుతీ వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. నేను దర్బార్ ఫంక్షన్ కు వెళ్తున్నాను అని నా భార్య కు చెప్తే తను అదృష్టవంతుడ్ని అని పొగిడింది. మీ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చప్పట్లు కొడుతూనే ఉన్నా. మిమ్మల్నొక ప్రొడ్యూసర్ ఎగతాళి చేస్తే దానికి మీరు రెండేళ్లలో ఓ ఫారిన్ కారు కొనుక్కొని ఓ ఇంగ్లీష్ వ్యక్తిని డ్రైవర్ గా పెట్టుకుని అతని దగ్గరకు వెళ్లానని చెప్పారు.
మీ కసి మీకెంత ఉపయోగపడిందో తెలియదు కానీ, ఎంతో మంది జీవితాలకు ప్రేరణ ఇచ్చింది సార్. రజనీకాంత్ అంటే ఓ పేరు కాదు ఓ ఉప్పెన్ లా చేసినందుకు థ్యాంక్స్ సార్’ అని పొగడ్తలు కురిపించారు. నిర్మాతకు, నివేదా థామస్ కు, డైరక్టర్ మురుసదాస్ కు ఆల్ ద బెస్ట్’ అని ప్రశంసలు కురిపించాడు వంశీ పైడిపల్లి.
డైరక్టర్ మారుతూ మాట్లాడుతూ.. మాస్ మరణం.. ఆయన ఎదరుగుండా కూర్కొపెట్టి మాట్లాడాలంటే చాలా అదృష్టం ఉండాలి. పవర్ స్టార్ ఉన్నప్పుడు ఎలా కేకలు వినపడేవో.. అలా అనిపించింది. గూస్ బమ్స్ వచ్చాయి. రజనీకాంత్ సార్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన వయస్సు వెనక్కివెళ్లినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ముగించాడు.
జనవరి 9న రిలీజ్ కానున్న సినిమా ఎంత మేర హిట్ కొడుతుందో.. చూడాలి మరి.