Varalaxmi Sarathkumar : పీఎం మోదీని తన పెళ్ళికి ఆహ్వానించిన వరలక్ష్మి.. థ్యాంక్యూ నాన్న అంటూ..

తాజాగా వరలక్ష్మి పీఎం మోదీని తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానించింది.

Varalaxmi Sarathkumar : పీఎం మోదీని తన పెళ్ళికి ఆహ్వానించిన వరలక్ష్మి.. థ్యాంక్యూ నాన్న అంటూ..

Varalaxmi Sarathkumar Invites PM Narendra Modi for her Receptions

Updated On : June 29, 2024 / 11:31 AM IST

Varalaxmi Sarathkumar : సౌత్ లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరూ దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని సమాచారం. వరలక్ష్మి పెళ్లి సింపుల్ గానే చేసుకుంటున్నా రిసెప్షన్ మాత్రం చెన్నైలో గ్రాండ్ గా చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

గత కొన్ని రోజులుగా వరలక్ష్మి శరత్ కుమార్ పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలిసి తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్, తమిళ్ సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలను తన రిసెప్షన్ ఈవెంట్ కు పిలిచింది. తాజాగా వరలక్ష్మి పీఎం మోదీని తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానించింది. వరలక్ష్మి తన తండ్రి శరత్ కుమార్, రాధిక, తన కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్ లతో పీఎం మోదీని కలిసి తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వాన పత్రికను ఆహ్వానించింది.

Also Read : ‘పుష్ప’లో అల్లు అర్జున్ అనుకున్నారా.. అల్లరి నరేష్ కొత్త మాస్ గెటప్..

పీఎం మోదీతో దిగిన ఫోటోలను వరలక్ష్మి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మోదీ గారు మీ అద్భుతమైన స్వాగతంకు ధనువాదాలు. మీ బిజీ షెడ్యూల్ లో మాతో మంచి సమయాన్ని గడిపారు, ఇది మాకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్యూ నాన్న మోదీ గారిని కలిసేలా చేసినందుకు అని పోస్ట్ చేసింది.

తాజా సమాచారం ప్రకారం చెన్నైలోని తాజ్‌ హోటల్‌లో ప్రీ వెడ్డింగ్‌, మెహిందీ సెర్మనీ నిర్వహించి, జులై 2 థాయ్‌లాండ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఉంటుందని, ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందని సమాచారం.