Varun – Lavanya : జూన్ 9న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..

ఇటీవల లావణ్య – వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. తాజాగా వీరిద్దరి పేర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Varun – Lavanya : జూన్ 9న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..

Varun Tej and Lavanya Tripathi Engagement in soon news goes viral

Updated On : June 1, 2023 / 1:40 PM IST

Varun – Lavanya :  హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని గతంలో వార్తలు వచ్చాయి. అవి వైరల్ అయినా కూడా ఇద్దరూ స్పందించలేదు. ఇప్పుడు మరోసారి ఈ జంట వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి గతంలో మిస్టర్(Mister), అంతరిక్షం అనే రెండు సినిమాలు చేశారు. అంతరిక్షం సినిమా సమయం నుంచే వీరిద్దరూ క్లోజ్ అయ్యారని, ఆ తర్వాత లవ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

వరుణ్ చెల్లి నిహారిక పెళ్ళికి ఏ హీరోయిన్ రాకపోయినా లావణ్య వచ్చింది. దీంతో ఈ న్యూస్ మరింత బలపడింది. నిహారికతో కూడా లావణ్య చాలా క్లోజ్ గా ఉంటుంది. మెగా ఫ్యామిలిలో జరిగే పలు ఫంక్షన్స్ కి, నిహారిక, వరుణ్ పార్టీలకు లావణ్య త్రిపాఠి కూడా హాజరవుతున్నట్టు సమాచారం. ఇటీవల లావణ్య – వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ నడిచింది.

Urvashi Rautela : వామ్మో.. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇంటి ధర.. ఏకంగా అన్ని కోట్లా?

తాజాగా వీరిద్దరి పేర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. జూన్ 9వ తేదీన కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యలో లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ కూడా స్పందించలేదు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున, మరో సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నాడు. లావణ్య త్రిపాఠి ఓ తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. మరి నిజంగానే లావణ్య మెగా కోడలు కానుందా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. దీనిపై వరుణ్, లావణ్యలు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Varun Tej and Lavanya Tripathi Engagement in soon news goes viral