Varun – Lavanya : స్విట్జర్లాండ్ మంచుకొండల్లో కర్వాచౌత్ చేసుకున్న లావణ్య.. వరుణ్ – లావణ్య ఫొటో వైరల్..
తాజాగా వరుణ్ తేజ్, లావణ్య కలిసి ఓ ఫోటో షేర్ చేసారు.

Varun Tej and Lavanya Tripathi Shares Photo from Switzerland goes Viral
Varun – Lavanya : మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన కాలి గాయం నుంచి ఇటీవలే కోలుకుంది. రెగ్యులర్ గా వరుణ్ తేజ్ తో ఫొటోలు పెడుతూ వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత నుంచి లావణ్య, వరుణ్ తేజ్ రెగ్యులర్ గా ట్రిప్స్ వేస్తున్నారు. తాజాగా వరుణ్, లావణ్య, నాగబాబు, నాగబాబు భార్య, నిహారిక.. ఇలా ఫ్యామిలీ అంతా స్విట్జర్లాండ్ ట్రిప్ కి వెళ్లారు. ఇటీవలే నాగబాబు స్విట్జర్లాండ్ ట్రిప్ నుంచి పలు ఫొటోలు కూడా షేర్ చేసాడు.
Also Read : Namrata Shirodkar – Sonali Bendre : మహేష్ బాబు హీరోయిన్‌తో మహేష్ భార్య.. క్యాన్సర్ పై పోరాటం..
తాజాగా వరుణ్ తేజ్, లావణ్య కలిసి ఓ ఫోటో షేర్ చేసారు. స్విట్జర్లాండ్ లో జర్మట్ అనే నగరంలో మంచుకొండల్లో స్కేటింగ్ చేస్తూ వరుణ్, లావణ్య కలిసి దిగిన ఫోటోని ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారగా క్యూట్ కపుల్, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే ఇదే ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి కర్వా చౌత్ రోజు చంద్రుడు నా వైపే ఉన్నాడు అని పోస్ట్ చేసింది లావణ్య. దీంతో కర్వాచౌత్ పండగ లావణ్య – వరుణ్ స్విట్జర్లాండ్ లో చేసుకున్నారు అని తెలుస్తుంది. అలాగే ఓ మూడు రోజుల క్రితం వరుణ్, లావణ్య కలిసి ఉన్న క్యూట్ ఫొటో కూడా ఒకటి షేర్ చేసారు ఈ జంట.