తలరాతని తిరిగి రాసే శక్తి ప్రేమకే ఉంది : ‘వెంకీమామ’ ట్రైలర్

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీమామ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 9, 2019 / 08:01 AM IST
తలరాతని తిరిగి రాసే శక్తి ప్రేమకే ఉంది : ‘వెంకీమామ’ ట్రైలర్

Updated On : December 9, 2019 / 8:01 AM IST

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీమామ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకట్టగా.. బాబీ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Image

డిసెంబర్ 7న ఖమ్మంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వెంకీమామ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికుందని నీ నమ్మకం.. ఆ రాతని తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకుందనది నా నమ్మకం’ అంటూ వెంకీ చెప్పే డైలాగుతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

Image

వెంకీ, చైతుల రిలేషన్, వెంకీ మార్క్ కామెడీ, చైతు, రాశీల లవ్ ట్రాక్, వెంకీ, పాయల్ మధ్య వచ్చే కన్ఫ్యూజన్‌తో కూడిన లవ్ ట్రాక్, మిలటరీ ఎపిసోడ్, విలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న ‘వెంకీమామ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..

Image