విడుదలకు సిద్ధం అవుతున్న “విద్యార్థి”.. థియేటర్స్‌లోనే!

మహాస్ క్రియేషన్స్ పతాకంపై మధు బాబు దర్శకత్వంలో ‘రాజుగారి గది’ ఫేమ్ చేతన్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బన్నీ వాక్స్(వర్షిణి) హీరో హీరోయిన్లుగా ఆళ్ల వెంకట్(AV) మరియు రామకృష్ణ రేజేటి నిర్మాణంలో వస్తున్న సినిమా ‘విద్యార్థి’. ఇటీవలే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. కరోనా కారణంగా చాలాకాలంగా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమాను మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చెయ్యాలని చిత్రయూనిట్ భావిస్తుంది.
క్రిస్మస్ సంధర్భంగా సినిమాకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు దర్శకుడు మధు బాబు.. “ముందుగా మా విద్యార్థి టీం తరుపున తెలుగు ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా విద్యార్థి సినిమా షూటింగ్ అంత పూర్తీ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలోనే థియేటర్స్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది. హీరో చేతన్ చీను అద్భుతమైన నటన, మంచి సంగీతం, ఆలోచింపజేసే డైలాగు లతో ఒక అందమైన సినిమా ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరికి నచ్చుతుంది అనే నమ్మకం నా కుంది” అని తెలిపారు.
నిర్మాతలు ఆళ్ల వెంకట్ మరియు రామకృష్ణ రేజేటి మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా విదార్థి సినిమా టీజర్ ను చాలా బాగా ఆదరించారు. మా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ బాగా తెరకెక్కించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతొంది, మా సినిమాకు పని చేసిన అందరూ టెక్నీషయన్స్, ఆర్టిస్ట్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కెమెరా మాన్ పనితనం సినిమా కి ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.
మధు బాబు దర్శకత్వం, బల్గానిన్ సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ సినిమా కి మంచి హైప్ తీసుకొస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మా సినిమా ని థియేటర్ లో విడుదల చేస్తాము” అని తెలిపారు.
నటీనటులు:
చేతన్ చీను, బన్నీ వాక్స్ (వర్షిణి), రఘుబాబు, మణిచందన, జీవా, టీఎన్ఆర్, నవీన్ నేని, యాదమ్మ రాజు, నాగమహేష్, పవన్ సురేష్, జ్వాల కోటి, శరణ్ అడ్డాల.
సాంకేతిక బృందం:
పాటలు: భాస్కరభట్ల, సురేష్ బనిశెట్టి, వాసు వలబోజు
సినిమాటోగ్రఫీ: కన్నా పిసి.
ఎడిటింగ్: బొంతల నాగేశ్వరరెడ్డి
స్టంట్స్: రామకృష్ణ
కొరియోగ్రఫీ: అనీష్
మాటలు : నవీన్ కోలా, మధు బాబు
లైన్ ప్రొడ్యూసర్: వంశీ తాడికొండ
సహ నిర్మాత: రామకృష్ణ రేజేటి (ఆర్.ఆర్.కె.)
నిర్మాత: ఆళ్ల వెంకట్ (ఏవీ) మరియు రామకృష్ణ రేజేటి
దర్శకత్వం: మధు బాబు
బ్యానర్: మహాస్ క్రియేషన్స్