Bichagadu 2: బిచ్చగాడు 2 నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?

తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ మూవీ తెలుగులో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ మూవీని విజయ్ ఆంటోని తెరకెక్కిస్తుండటంతో బిచ్చగాడు-2 మూవీపై కూడా అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Bichagadu 2: బిచ్చగాడు 2 నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఏమిటో తెలుసా?

Updated On : February 9, 2023 / 10:00 PM IST

Bichagadu 2: తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ మూవీ తెలుగులో ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ మూవీని విజయ్ ఆంటోని తెరకెక్కిస్తుండటంతో బిచ్చగాడు-2 మూవీపై కూడా అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Bichagadu 2: విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ వచ్చేది అప్పుడే!

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి తొలి 4 నిమిషాలు స్నీక్ పీక్ వీడియోగా ఇవ్వబోతున్నట్లు విజయ్ ఆంటోనీ తెలిపాడు. ఇటీవల విజయ్ షూటింగ్‌లో ప్రమాదానికి గురికావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఆయన నుండి ఇలాంటి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బిచ్చగాడు-2 మూవీకి సంబంధించిన ఈ స్నీక్ పీక్ వీడియోను ఫిబ్రవరి 10న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.