Sam Jam: సమంత షో లో విజయ్

  • Published By: sekhar ,Published On : November 10, 2020 / 11:49 AM IST
Sam Jam: సమంత షో లో విజయ్

Updated On : November 10, 2020 / 2:47 PM IST

Sam Jam: మ్యారేజ్ తర్వాత సమంత కెరీర్‌ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. సినిమాలతో పాటు Ekam (Ekam Early Learning Centre) అనే స్కూల్, అలాగే SAAKI పేరుతో ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారి కోడలు ఇప్పుడు డిజిటల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం ‘‘సామ్ జామ్’’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు సామ్.



ఈ షోలో ఆమె పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ షో లో పాల్గొన్నాడు. సిల్వర్ కలర్ సూట్‌తో స్టైలిష్‌గా మెరుస్తున్న విజయ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
https://10tv.in/samantha-akkineni-turns-talk-show-host-on-aha/


‘నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు’ అంటూ ఇటీవల బుల్లితెరపై కూడా సత్తా చాటిన సమంత ‘‘సామ్ జామ్’’ షో తో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ మీద కూడా ధూం.. ధాం.. చేయనున్నారని కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా!

Samantha