నడిరోడ్డుపై సహనం కోల్పోయి హీరో అక్షయ్ కుమార్ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్
అతడి వద్దకు వెళ్లి, అతడి మొబైల్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోపంగా చెప్పాడు.

Akshay Kumar
ఓ యువకుడు చేసిన పనికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహనం కోల్పోయాడు. అక్షయ్ కుమార్ లండన్ ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో లూజ్ షార్ట్స్, స్లీవ్ లెస్ టాంక్ టాప్, బీనీ ధరించి, రగ్గడ్ స్టైల్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అతడిని ఓ అభిమాని గుర్తించాడు.
అక్షయ్ కుమార్ అనుమతి లేకుండా ఆ అభిమాని అతడి వీడియో తీశాడు. ఈ విషయాన్ని అక్షయ్ గమనించి చిరాకు పడ్డాడు. అతడి వద్దకు వెళ్లి, అతడి మొబైల్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోపంగా చెప్పాడు.
ఆ తర్వాత అక్షయ్ కుమార్ శాంతపడ్డాడు. చివరకు, ఓకే అంటూ ఆ అభిమానితో సెల్ఫీకి పోజు ఇచ్చివెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అక్షయ్ కుమార్‌తో సెల్ఫీ దిగిన ఆ అభిమానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. “ఆయన నన్ను కోపంగా తాకడం నాకు దక్కిన ఓ అద్భుతమైన అనుభవం” అని పేర్కొన్నాడు.
నటీనటులకు “కొంచెం ప్రైవసీ ఇవ్వండి” అంటూ కొందరు కామెంట్లు చేశారు. “అనుమతి లేకుండా వీడియో తీయడం సరికాదు” అని ఇంకొకరు పేర్కొన్నారు.
కాగా, తాజాగా అక్షయ్ హౌస్‌ఫుల్ 5 సినిమాలో కనిపించాడు. ఇక ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న భూత్ బంగ్లాలో వామికా గబ్బి, పరేష్ రావల్ తో కలిసి కనిపించనున్నాడు. వెల్కమ్ టు ది జంగిల్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అలాగే జాలీ ఎల్‌ఎల్‌బీ 3లోనూ నటిస్తున్నాడు.
View this post on Instagram