విరుష్క ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తల్లికాబోతున్న అనుష్క!

Virushka Couple announce pregnancy: సెలబ్రిటీ కపుల్ విరుష్క గురువారం అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
ఈ మేరకు అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నాం’’.. అంటూ అనుష్క గర్భవతి అని పేర్కొన్నారు. అనుష్క శర్మ కూడా ఇదే క్యాప్షన్‌తో పిక్ పోస్ట్ చేశారు.
https://10tv.in/virat-kohli-anushka-to-welcome-their-first-child-in-january-2021/
ఒక యాడ్ షూటింగులో పరిచయమైన విరాట్, అనుష్క తర్వాత ప్రేమికులుగా మారారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. విరాట్ టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ తండ్రి కాబోతున్నాడని తెలియగానే క్రికెట్ రంగానికి చెందిన పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుష్క కొద్దిరోజులుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. విరుష్క జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
And then, we were three! Arriving Jan 2021 ❤️? pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020