Virupaksha: ‘విరూపాక్ష’కు సాలిడ్ రెస్పాన్స్.. తమిళనాట ప్రభంజనం ఖాయం..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ తెలుగులో సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో, అక్కడ కూడా ఈ మూవీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Virupaksha Tamil Premiere Gets Solid Response
Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తరువాత చేసిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాను కొత్త దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే, అందరి అంచనాలను తారుమారు చేస్తూ, విరూపాక్ష బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మిస్టిక్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.
Virupaksha : బాలీవుడ్‌లో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముంబైలో ల్యాండ్ అయిన సాయి ధరమ్!
ఈ సినిమాలోని హార్రర్ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. దీంతో వారు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు కావస్తున్నా, ఇంకా వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో జాయిన్ అవడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, తెలుగులో ఈ సినిమాకు వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ చూసి, ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Virupaksha: 10 రోజుల్లో 76.. టార్గెట్ సెంచరీ దిశగా విరూపాక్ష పరుగు!
తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విరూపాక్ష చిత్రాన్ని మే 5న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ ఆడియెన్స్‌కు విరూపాక్ష మూవీ ప్రీమియర్ వేసి చూపెట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు అక్కడ సాలిడ్ రెస్పాన్స్ దక్కడంతో తమిళంలో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటనకు మంచి మార్కులు పడగా, అందరినీ అవాక్కయ్యేలా చేసింది అందాల భామ సంయుక్త మీనన్. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బివిఎస్ఎన్.ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.