Mark Antony Trailer : ఆకట్టుకుంటున్న మార్క్ ఆంటోని ట్రైలర్.. టైమ్ ట్రావెల్ ఫోన్ కాన్సెప్ట్..!
తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటిస్తున్న చిత్రం మార్క్ ఆంటోని(Mark Antony). ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్(Ritu Varma).

Mark Antony Trailer
Mark Antony : తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal) నటిస్తున్న చిత్రం మార్క్ ఆంటోని(Mark Antony). ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్(Ritu Varma). ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. తమిళంలో కార్తీ, తెలుగులో రానా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Amala : నాగార్జున పాటకు స్టేజిపై డాన్స్ వేసి అదరగొట్టిన అమల.. వీడియో వైరల్..
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఒక ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేయడం అనే పాయింట్‌పై సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, తెలుగు నటుడు సునీల్ పాత్రలను పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. హీరో విశాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, ఎస్‌జే సూర్య పాత్ర విభిన్నంగా ఉండనుందని క్లారిటీ వచ్చింది. అయితే.. ట్రైలర్ లో కథను పెద్దగా రిలీల్ చేయలేదు. ఈ విషయంలో చిత్ర బృందం జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.
Vijay Deverakonda : యాదాద్రి ఆలయం గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్.. తెలంగాణ ప్రభుత్వం..
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ బాషల్లో విడుదల చేయనున్నారు. మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.