Rekha Boj : బిగ్‌బాస్ 8 లోకి ఈ బోల్డ్ భామ.. జనసేనకు కూడా ప్రచారం చేసింది..

ఇటీవలే బిగ్‌బాస్ 8 లోగో ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఈ షోలోకి వెళతారని పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

Rekha Boj : బిగ్‌బాస్ 8 లోకి ఈ బోల్డ్ భామ.. జనసేనకు కూడా ప్రచారం చేసింది..

Vizag Actress Rekha Boj in to Bigg Boss 8 rumours goes Viral

Updated On : July 27, 2024 / 8:06 AM IST

Rekha Boj – BiggBoss 8: రియాల్టీ షో బిగ్‌బాస్ ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తికాగా త్వరలో 8వ సీజన్ మొదలు కాబోతుంది. ఇటీవలే బిగ్‌బాస్ 8 లోగో ప్రోమో కూడా రిలీజ్ చేసారు. ఈ షోలోకి వెళతారని పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి, విష్ణుప్రియ, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, బర్రెలక్క, ఓ సెలబ్రిటీ కపుల్.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ బాటలో మరో భామ పేరు వినిపిస్తుంది.

Also Read : KCR – Double Ismart : డబల్ ఇస్మార్ట్ – కేసీఆర్ వివాదం.. అందుకే కేసీఆర్ డైలాగ్ తీసుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన మణిశర్మ..

పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అయింది రేఖ భోజ్. పలు సినిమాల్లో కూడా నటించింది. సినిమాల్లో నటిగా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది రేఖ భోజ్. వైజాగ్ కి చెందిన ఈ భామ రెగ్యులర్ గా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ, తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేసింది. గతంలో బిగ్‌బాస్ రివ్యూలు కూడా చేసింది.

ఇప్పుడు ఈ రేఖ భోజ్ బిగ్‌బాస్ 8 లోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. రేఖ భోజ్ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. మరి ఈ బోల్డ్ భామ బిగ్‌బాస్ లోకి వస్తుందా చూడాలి. ఇక బిగ్‌బాస్ సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలు కానున్నట్టు సమాచారం.