సైరా ఫీవర్ : మెగా అభిమానుల సందడి

  • Published By: madhu ,Published On : October 2, 2019 / 01:17 AM IST
సైరా ఫీవర్ : మెగా అభిమానుల సందడి

Updated On : October 2, 2019 / 1:17 AM IST

ప్రపంచవ్యాప్తంగా 5 వేల థియేటర్స్‌, 6 వేలకుపైగా స్ర్కీన్స్‌పై  సైరా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 12 వందల 60 థియేటర్స్‌లో సైరా రిలీజైంది. నైజాంలో 420, సీడెడ్‌లో 360, ఆంధ్రాలో 480 థియేటర్స్‌లో సైరా సందడి చేస్తోంది. ఇక తమిళనాడులో 360, కర్ణాటకలో 370, కేరళలో 130 థియేటర్స్‌లో సైరా మూవీ విడుదలైంది. ఇక ఉత్తరాదిలో మొత్తం 1700 థియేటర్స్‌లో సైరా చిత్రాని రిలీజ్‌ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్‌ దేశాల్లో మొత్తం 11 వందల స్ర్కీన్స్‌పై సైరా సందడి షురూ అయింది. 

ఇప్పటివరకు బాహుబలి చిత్రాన్ని అత్యధికంగా 9 వేలకుపైగా స్ర్కీన్స్‌పై పదర్శించారు. మొన్నీమధ్య రిలీజైన సాహో చిత్రం కూడా 8 వేలకుపైగా స్ర్కీన్స్‌పై సందడి చేసింది. సైరా మూవీ మొత్తం బడ్జెట్ రూ.280 కోట్లు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. డిసెంబర్‌ 6, 2017న సైరా షూటింగ్ మొదలవగా… ఈ ఏడాది జూన్‌ 24న షూటింగ్ పూర్తయింది.

సైరా నరసింహారెడ్డి చిత్రం మెగాస్టార్ కన్నకల. 280 కోట్ల బడ్జెట్.. దాదాపు రెండున్నరేళ్ల కృషి.. సైరా నరసింహారెడ్డి సినిమాగా ఆవిష్కృతమైంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో.. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజక్ట్ ఇన్నేళ్లకు సాకారమైంది. 12 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ చిరంజీవికి వినిపించి కదిలించిన కథ.. ఎంతో కష్టపడి కథను కూర్చి మెగాస్టార్‌ను మెప్పించిన దర్శకుడు.. తండ్రికి జీవితాంతం గుర్తుండి పోయే బహుమతి ఇవ్వాలని కొడుకు రామ్ చరణ్ చేసిన సాహసం.. అన్నీ కలసి  సైరా సినిమాగా రూపొందింది.

మొదటి తరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసిహారెడ్డి గురించి 12 ఏళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ చెప్పడంతో అప్పటి నుంచి ఈ కథను సినిమాగా చేయాలి అనుకున్నాడు మెగాస్టార్. కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను చేయలేకపోయాడు. ఇన్నేళ్లకు మెగాస్టార్ అనకున్నది సాధిచాడు. 280 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన సైరా కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడారు. 65 ఏళ్ల వయస్సులో కూడా యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుని మరీ.. ఉత్సాహంతో పని చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

తెలుగు రాష్ట్రాల్లో సైరా సందడి మొదలైంది. అక్టోబర్ 02వ తేదీ బుధవారం ఉదయం విశాఖలో 4 గంటల నుంచి షోలు పడటంతో అభిమానులు ఆనందానికి అవథులు లేకుండా పోయింది. విశాఖలోని థియేటర్స్ అన్ని కూడా సైరా నినాదంతో మారుమోగుతున్నాయి. థియేటర్స్‌ దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. విజయవాడలో సైరా నినాదాలతో థియేటర్స్‌ మారుమోగిపోతున్నాయి. హైదరాబాద్‌లో కూడా అదే పరిస్థితి ఉంది.