YRF Spy Universe : షారుఖ్, సల్మాన్.. బాలీవుడ్ స్టార్స్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్న YRF స్పై యూనివర్స్..
స్టార్ హీరోలకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది. అందులోను YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చే సినిమాలతో బాలీవుడ్ కి హిట్ ఇస్తూ, స్టార్ హీరోలకు గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది.

YRF Spy Universe gives super hits to Bollywood Stars
YRF Spy Universe : కరోనా ముందు నుంచి 2023 ముందు వరకు బాలీవుడ్(Bollywood) పరాజయాల్లోనే గడిపింది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సైతం సినిమాల్లో ఉన్నా ఫ్లాప్స్ వచ్చాయి. సౌత్ సినిమాలు డామినేట్ చేయడం, బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడం, బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ అవ్వడం.. ఇక బాలీవుడ్ పని అయిపొయింది అనుకున్నారు అంతా. ఒకటి రెండు చెప్పుకోదగ్గ విజయాలు తప్ప బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. హీరోలు కూడా షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్స్ కూడా ఫ్లాప్స్ లో ఉన్నారు.
కానీ స్టార్ హీరోలకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది. అందులోను YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చే సినిమాలతో బాలీవుడ్ కి హిట్ ఇస్తూ, స్టార్ హీరోలకు గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది. జనవరిలో పఠాన్ సినిమాతో వచ్చిన షారుఖ్(Shah Rukh Khan) అప్పటి వరకు ఫ్లాప్స్ లో ఉండగా పఠాన్ సినిమాతో సక్సెస్ కొట్టాడు. దాదాపు ఆరేళ్లుగా హిట్ లేని షారుఖ్ కి యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన పఠాన్ సినిమాతో హిట్ వచ్చింది. పఠాన్ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక ఇదే స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా ఇటీవల వచ్చిన టైగర్ 3 కూడా మంచి విజయం సాధించింది. టైగర్ 3 సినిమా ఆరు రోజుల్లోనే 300 కోట్లు సాధించింది. సల్మాన్ ఖాన్ కి కూడా గత రెండేళ్లుగా హిట్స్ లేవు. కానీ ఇప్పుడు స్పై యూనివర్స్ లో టైగర్ 3 సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం YRF స్పై యూనివర్స్ నుంచి హృతిక్ రోషన్ వార్ 2 సినిమా తెరకెక్కిస్తోంది. హృతిక్ గత సినిమా విక్రమ్ వేద ఫ్లాప్ గానే మిగిలింది. అంతకు ముందు హిట్ ఇచ్చిన వార్ సినిమా YRF స్పై యూనివర్స్ లోదే. ఇప్పుడు రాబోతున్న వార్ 2 కూడా స్పై యూనివర్స్ లోనే తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమాతో మళ్ళీ హృతిక్ హిట్ కొడతాడని భావిస్తున్నారు.
Also Read : Salaar Trailer : సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్.. వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్..
ఇలా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ తమ YRF స్పై యూనివర్స్ తో బాలీవుడ్ స్టార్ హీరోలకు గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది.