మెసేజ్ మ్యారేజ్ : పెళ్లంతా 100 శాతం ఓటింగ్ నినాదమే

ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్..నేడంతా ట్రెండ్ మయంగా మారిపోతోంది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 06:10 AM IST
మెసేజ్ మ్యారేజ్  : పెళ్లంతా 100 శాతం ఓటింగ్ నినాదమే

Updated On : April 17, 2019 / 6:10 AM IST

ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్..నేడంతా ట్రెండ్ మయంగా మారిపోతోంది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు.

రాయ్‌పూర్: ట్రెండ్..ట్రెండ్..ట్రెండ్..నేడంతా ట్రెండ్ మయంగా మారిపోతోంది. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్ ను సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు. అంతేకాదు ఆ బాధ్యతను అందరూ నెరవేర్చాలని కోరుకుంటున్నారు. దీనికోసం విభిన్న..వినూత్న రీతుల్లో వెల్లడిస్తున్నారు.  దేశవ్యాప్తంగా విడదతవారీగా కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికలు సందర్భంగా ఓ యువజంట తమ పెళ్లి  వేడుకల్లో మంచి మెజేస్ ను ఇచ్చారు. ఇప్పటివరకూ ఫలానా వారికి ఓటు వేయమని చెప్పటం..వెడ్డింగ్ కార్డ్ లో ఓటింగ్ విషయాన్ని ప్రస్తావించడం చూశాం. కానీ వీరు మాత్రం తమ పెళ్లి వేడుక మొత్తం..నూటికి నూరు శాతం ఓటింగ్ అంటు నినాదిస్తోంది. ఇది చత్తీస్ గఢ్ లో జరిగింది. ఏప్రిల్ 11న ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా చత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో వినూత్న వివాహం అందర్నీ ఆకట్టుకుంది. 
Read Also : అమ్మబాబోయ్ : సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు స్వాధీనం

ఈ పెళ్లిలో  మండపం మొదలుకొని మహిళల అలంకరణల వరకూ అంతటా 100 శాతం ఓటింగ్ జరగాలనే నినాదం రాశారు. పైగా వధూవరులు వేసిన ఏడడుగుల్లో ఎనిమిది ప్రమాణాలు చేశారు. ఏడు అడుగులకు ఏడు ప్రమాణాలు చేయిస్తారు. కానీ ఈ వధూవరులు మాత్రం ఎనిమిదో ప్రమాణాన్ని కూడా చేశారు. అదేంటంటే..తమ జీవితంలో వచ్చే ప్రతీ ఎన్నికల్లోనూ ఓటు వేయటం మానం అని..అన్ని ఓట్లు  వేస్తామని తమ  ఎనిమిదవ ప్రమాణం చేశారు.  దీంతో ఈ పెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

బాలోద్ పరిధిలోని హల్దీ గ్రామంలో మనీష్ సాహూకు తేజేశ్వరితో వివాహం జరిగింది. వీరిద్దరూ ఒకేచోట పీజీ చేశారు. ప్రస్తుతం తేజేశ్వరి స్టిచింగ్ వర్క్ చేస్తోంది. మనీష్ ట్రాక్టర్ కంపెనీలో పని చేస్తున్నాడు. పెళ్లి వేడుకల్లో వీరిద్దరూ దండలు మార్చుకునే సమయంలో పోస్టర్లు వేసుకున్నారు. దానిపై పెళ్లికి వచ్చినవారంతా తప్పనిసరిగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని రాశారు. మరి మంచి మంచి నినాదాలు చూసి ఊరుకోకుండా అందరూ పాటించి ఈ నూతన వధూవరుల మంచి ఆశయాన్ని నెరవేర్చాల్సిన అవసరముంది. అప్పుడే రాజ్యాంగ పరంగా లభించిన ఓటు హక్కు అసలు ఉద్ధేశ్యం నెరవేరుతుంది. 
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్