లాక్‌డౌన్‌లో 107 గృహ హింస కేసులు

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తన మూడేళ్ల బిడ్డ ఎదుటే తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. ఆ కాల్ తో మొత్తం 107కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో నుంచి బయటకుపోకుండా ఉండి మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పరిహార్(ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్/ వనితా సహాయవాణి)కి కాల్స్ వస్తూనే ఉన్నాయని అధికారులు అంటున్నారు.
కొన్ని కాల్స్ మాత్రం 100కు ఫోన్ చేసి సాయం కావాలంటున్నారని అడుగుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనే ఈ కాల్స్ ఎక్కువయ్యాయట. బాధితుల అడ్రస్ తెలుసుకుని వెళ్లే సరికి వారు వివాహ బంధం కొనసాగించాలా వద్దా అనే అనుమానంలో ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఇటీవల ఓ జంట పంచాయితీ పెట్టుకోగా కౌన్సిలింగ్ కు సీనియర్ కౌన్సిలర్ అపర్ణ పూర్ణేశ్ వెళ్లారట.
ఏడేళ్ల క్రితం ఆ జంటకు పెళ్లి అయింది. మూడేళ్ల పాప కూడా ఉంది. బెంగళూరులో ఉంటున్న వారిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. నెల జీతమంతా భర్తకు ఇచ్చేయడం దగ్గరే గొడవ మొదలైంది. వచ్చే నెల జీతం తన ఖర్చుల కోసం వాడుకుంటానని మహిళ అనడంతో వివాదం పెరిగిపోయింది. అతను శారీరకంగా, మాటలతోనూ ఆమెను హింసించాడు. సాయం కావాలని వెంటనే మహిళ సోదరుడికి కాల్ చేసింది.
అతను వచ్చి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. గాయాలకు ట్రీట్మెంట్ చేయించుకుని తానింక అతనితో కలిసి బతకలేనని నిర్ణయించుకుంది. ఆమె వచ్చి కంప్లైంట్ చేస్తున్నప్పుడు వివాహ బంధాన్నికాపాడాలా.. లేక ఇద్దరూ విడిపోవడానికి సహాయం చేయాలా అర్థంకాని స్థితిలో పోలీసులు పడ్డారు. కానీ, కాస్త సమయం ఇచ్చి భర్తకు, భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చి సరైన నిర్ణయం తీసుకునేంత వరకూ ఎదురుచూడాలి అంటున్నారు.
పరిహార్ ఇన్‌ఛార్జి రాణి శెట్టి.. ‘అంతకుముందు కాల్స్ తో పోల్చుకుంటే లాక్ డౌన్ సమయంలో ఎక్కువ కాల్స్ పెరిగాయి. టెలిఫోనిక్ కౌన్సిలింగ్ లు ఎక్కువగానే ఇస్తున్నాం. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ 107కేసులు నమోదయ్యాయి. పరిస్థితి అర్థం చేసుకుని వారు కలిసి ఉండేందుకే ప్రయత్నిస్తామని కౌన్సిలింగ్ అధికారులు వివరిస్తున్నారు.