Afghanistan Evacuees: అప్ఘానిస్తాన్ నుంచి ఇవాళ ఢిల్లీకి వచ్చినవారిలో 16మందికి కరోనా
అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.

Evacueees
Afghanistan Evacuees అప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు. కోవిడ్ సోకినవాళ్లందరినీ ఢిల్లీలోని నఫాఘర్ లోని ఐటీబీపీ క్యాంప్ లో 14 రోజులు క్వారంటైన్ లో ఉంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, మంగళవారం కాబుల్‌లో చిక్కుకున్న 78 మందిని ప్రత్యేక విమానంలో వయా దుశాంబే భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు,సోమవారం అప్ఘానిస్తాన్ నుంచి భారత్ చేరుకున్నవారిలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.
అప్ఘాన్‌ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. భారత్ ఇప్పటివరకు 800కిపైగా మందిని అప్ఘానిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతో పాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు. అప్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే మిషన్‌కు ‘ఆపరేషన్ దేవీ శక్తి అని’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఇవాళ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రక్రియలో నిరంతరాయంగా శ్రమిస్తున్న భారత వాయుసేన, ఎయిర్ ఇండియా, విదేశాంగ శాఖ బృందానికి సెల్యూట్ అని జైశంకర్ ట్వీట్ చేశారు.
16 Evacuees From Afghanistan Tested Positive For Covid-19 On Tuesday