Trains Cancelled : కుర్మీల బంద్ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో 20 రైళ్ల రద్దు…47 రైళ్ల దారి మళ్లింపు
తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. బంద్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే బుధవారం ప్రకటించింది....

Kurmi community calls for strike
Trains Cancelled : తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కుర్మీ కులస్థులు బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. బంద్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే బుధవారం ప్రకటించింది. (20 trains cancelled) సౌత్ ఈస్ట్రన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో మరో 47 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. తమకు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలో కుర్మీ తెగకు చెందిన ప్రజలు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు.
Ban Hookah Bars : కర్ణాటకలో హుక్కా బార్‌లపై త్వరలో నిషేధం
తమకు షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కల్పించాలని, కుర్మలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ పలు కుర్మీ సంఘాలు సెప్టెంబర్ 20వతేదీ నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని తొమ్మిది రైల్వే స్టేషన్లలో నిరవధిక రైల్వే దిగ్బంధనానికి పిలుపునిచ్చాయి. (Kurmi community calls for strike) దీంతో మూడు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధన్‌బాద్ రైలు డివిజన్‌లో గోమోహ్, రాంచీ రైలు డివిజన్‌లో మురి, అద్రా రైలు డివిజన్‌లో నిమ్డిహ్, చక్రధర్‌పూర్ రైలు డివిజన్‌లో ఘఘరా రైల్వేస్టేషన్లలో కుర్మీ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
వాట్సాప్‌లోనే ఆధార్, పాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!
పశ్చిమ బెంగాల్‌లోని ఖేమసులి, కుస్తౌర్‌లలో, ఒడిశాలో హరిచందన్‌పూర్, జరైకెలా, ధన్‌పూర్‌లలో రైళ్ల దిగ్బంధనం జరుగుతుందని కుర్మి సంఘాల నేతలు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు రైల్వే పోలీస్ ఫోర్స్ సిబ్బందిని కీలక స్టేషన్లలో పెద్ద సంఖ్యలో మోహరించినట్లు రాంచీ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చెప్పారు. కుర్మీ కమ్యూనిటీకి చెందిన వేలాది మంది సంప్రదాయ దుస్తులు ధరించి నిరసనల్లో పాల్గొంటారని జార్ఖండ్‌కు చెందిన టోటెమిక్ కుర్మీ వికాస్ మోర్చా (టికెవిఎం) అధ్యక్షుడు శీతల్ ఓహ్దార్ తెలిపారు. కుర్మీ కమ్యూనిటీ రైల్వే ట్రాక్‌లను అడ్డుకునే నిరసన గతేడాది సెప్టెంబర్ 20న ఐదు రోజుల పాటు కొనసాగింది.