జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు

  • Published By: srihari ,Published On : May 29, 2020 / 04:04 PM IST
జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు

Updated On : May 29, 2020 / 4:04 PM IST

జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయి. ఇందుకోసం రైల్వే వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాయి. అక్కడి పరిస్థితులకనుగుణంగా ప్రయాణికులు నిబంధనలు పాటించాల్సివుంది.

స్టేషన్ లో రైలు దిగిన వెంటనే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే స్వాప్ పరీక్షకు పంపుతారు. ఎటువంటి లక్షణాలు లేకపోతే ఇంట్లోనే 14 రోజులు హోంక్వారంటైన్ లో ఉండాలని చేతిపై స్టాంప్ వేస్తారు. 

ఇక గమ్యస్థానాలకు చేరిన ప్రయాణికులు రెండు వారాలపాటు ఇల్లు కదలకుండా ఉండాలి. మధ్యలో ప్రభుత్వ సిబ్బంది వచ్చి తనిఖీ చేస్తారు. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేకపోతే 15 వ రోజు స్వేచ్ఛగా అందరిలాగే బయట తిరగవచ్చు.  ఈ నిబంధనలు సాధారణ పౌరులతో వ్యాపారులు, అధికారులు అందరికీ వర్తిస్తాయి. 

ఇక క్వారంటైన్ లో ఉండగా సమావేశాలకు, బంధువులకు ఇంటికి వెళ్తామంటే అంగీకరించరు. ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా వర్తిస్తాయి. 
క్వారంటైన్ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. 

తెలంగాణలో మొదటి 14 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఆ తర్వాత మరో 14 రోజులు హోంక్వారంటైన్ లో ఉండాలి. కర్నాటక, తమిళనాడులో మొదటి 14 రోజులు పెయిడ్ క్వారంటైన్ లో ఉండాలి. మరో వారం రోజులు హోంక్వారంటైన్ లో ఉండాలి. 21 రోజలు ఎవరినీ కలవకూడదు. 

Read: ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ గడువు పెంపు