Students Test Covid Positive : ఒకే స్కూల్ లోని 26మంది విద్యార్థినులకు కరోనా

విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా రాష్ట్రం ​ మయూర్‌భంజ్‌ జిల్లాలోని చమక్ పూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలోని 26 మంది విద్యార్థినులు కరోనా వైరస్ బారిన పడ్డారు.

Students Test Covid Positive : ఒకే స్కూల్ లోని 26మంది విద్యార్థినులకు కరోనా

Odisa

Updated On : November 27, 2021 / 7:19 PM IST

Students Test Covid Positive : విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా రాష్ట్రం ​ మయూర్‌భంజ్‌ జిల్లాలోని తకుర్ముందా సిటీలోని చమక్ పూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలోని 26 మంది విద్యార్థినులు కరోనా వైరస్ బారిన పడ్డారు. గత వారం పాఠశాలకు వస్తున్న బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థులకు గత గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా 26మందికి కొవిడ్‌ నిర్ధరణ అయినట్లు శుక్రవారం వచ్చిన టెస్ట్ రిపోర్ట్ లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ స్కూల్ ప్రాంగణంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక,259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసర పరిస్థితే తలెత్తితే వెంటనే బాధితులను హాస్పిటల్ కు తరలించేందుకు పాఠశాల దగ్గర అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. ఇక,మరో 15 మంది విద్యార్థినుల స్వాబ్ నమూనాలను పరీక్షల కోసం బరిపాడ జిల్లా ప్రధాన ఆసుపత్రికి పంపారు. వీరి టెస్ట్ ఫలితాలు రావాల్సి ఉంది.

మరోవైపు,కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్​లోని SDM మెడికల్ కాలేజీలో కూడా కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఇప్పటివరకు వైరస్​ బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరినట్లు ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీశ్​ పాటిల్ తెలిపారు. ఇంకా 1,822 శాంపిల్స్​ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఇక, బెంగళూరు అర్బన్​​ జిల్లా, అనెకల్​ తాలుకలోని దొమ్మసంద్రలోని బోర్డింగ్​ పాఠశాలలో కూడా 33 మంది విద్యార్థులు సహా ఓ ఉపాధ్యాయుడికి కొవిడ్​-19 వైరస్​ పాజిటివ్​గా తేలింది.

ALSO READ Lecturer Beats Students : హోంవర్క్ చేయలేదని.. పైపులు, అట్టలతో విద్యార్థులను చితకబాదిన లెక్చరర్