సిగరెట్ పీక.. 300 కార్లను బూడిద చేసింది

చిన్న నిర్లక్ష్యం.. భారీ నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో కలకలం. ఎంతో మంది వీఐపీలు.. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్ షో లో పాల్గొన్న పైలట్లు.. షోను వీక్షించేందుకు వచ్చిన వీక్షకులు.. చూస్తుండగానే వందలాది కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. అప్పటివరకూ ఆహ్లాదకరంగా ఉన్న ఎయిర్ ఇండియా షో భారీ అగ్నిప్రమాదంతో భయానకంగా మారింది.
ఒకవైపు ఎండ మండిపోతుంది. వేడిగాలులు వీస్తున్నాయి. ఎండ తీవ్రతకు పార్కింగ్ ప్రాంతంలో ఎండుగడ్డి సైతం వేడిక్కింది. పార్కింగ్ దగ్గర ఎవడో సిగరేట్ తాగాడు. తాపీగా సిగరేట్ పీకను కింద పడిసి పోయాడు. చిన్న నిప్పు రవ్వే కదా? ఏం చేస్తుందిలే అనుకుంటే.. చిలికి చిలికి గాలివానలా మారినట్టు.. దట్టమైన పొగలు వ్యాపించాయి. పార్కింగ్ చేసిన ఒక కారుకు వ్యాపించిన మంటలు మరో కారుకు అంటుకున్నాయి. అలా సెకన్ల వ్యవధిలో వందల కార్లు బూడిదై పోయాయి.
Read Also: ఎయిర్ షోలో బీభత్సం : మంటల్లో 100 కార్లు
ఎయిర్ షో చూస్తున్న కారు యజమానులంతా గాల్లోకి ఎగసిన దట్టమైన పొగను చూసి ఎక్కడోది అనుకున్నారంతా. ఎయిర్ షోలో మళ్లీ ఏదైనా విమానం కుప్పకూలిందేమో అని అనుకున్నారు. కాదు… విమానం కాదు.. తగలబడుతుంది తమ కార్లే అని తెలిసి పార్కింగ్ వైపు పరుగులు పెట్టారు. అప్పటికే అంతా అయిపోయింది. ఇంకా ఏం మిగల్లేదు. కేవలం కార్ల బూడిద మాత్రమే మిగిలింది. లక్షలు పోసిన కొన్న కార్లు ఇలా మంటల్లో కాలిపోతుండేసరికి యజమానుల గుండెలు అదిరిపోయాయి. లబోదిబోమన్నారు. గుండెలు బాదుకున్నారు. ఏం చేయాలో పాలుపోలేదు.
Read Also: ఏరో ఇండియా షో నిలిపివేత
కళ్లముందే ముచ్చటపడి కొనుకున్న కార్లు ఇలా మంటల్లో తగలబడి పోవడం చూసి తట్టుకోలేకపోయారు. పార్కింగ్ చేసిన కార్లు చేసినట్లే ఆగ్నికి ఆహుతి అయ్యాయి. క్షణాల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ కారు పార్కింగ్ చేసినవారంతా ఎయిర్ షో చూస్తుండటంతో ప్రాణనష్టం తప్పింది. లేదంటే ఎంత ఘోరం జరిగి ఉండేది.. ఊహించుకుంటేనే వణుకు వచ్చేస్తుంది కదా.. ఈ ప్రమాద దృశ్యాలను చూసిన వారంతా అనుకుంటున్నారు.
Vehicles got fire at parking area of #AiroIndia show at Yalahanka. Fire fighters On the spot.@DGP_FIRE @SunilagarwalI @KarnatakaVarthe pic.twitter.com/5YAk2izsDx
— Karnataka Fire Dept (@KarFireDept) February 23, 2019
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్