46 రోజులు అమర్‌నాథ్ యాత్ర : ఏప్రిల్ 1నుంచి రిజిస్ట్రేషన్ షురూ

భోపాల్: హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లలని కోరుకునే యాత్ర అమర్‌నాథ్ యాత్ర. ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై కానుంది. ఇది ఆగస్టు 15 వరకూ కొనసాగనున్న ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. 2018లో అమర్‌నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. 2019లో ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై ఆగస్టు మొదటివారం వరకూ రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 400కు మించిన బ్రాంచీల ద్వారా ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా కొనసాగిస్తున్న క్రమంలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని..75 ఏళ్ల కన్నా ఎక్కవ వయసుగల వారికి యాత్ర చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. అలాగే ఆరు నెలలు దాటిన గర్భవతులు కూడా యాత్ర చేసేందుకు అవకాశం లేదు.