Earthquake : చంబాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3గా తీవ్రత నమోదు

Earthquake : మనాలిలో చాలా బలమైన ప్రకంపనలు సంభవించాయని, దాదాపు ఏడు సెకన్ల పాటు భూమి కంపించిందని మనాలి స్థానికుడు ఒకరు చెప్పారు.

Earthquake : చంబాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3గా తీవ్రత నమోదు

5.3 Earthquake Hits Chamba In Himachal Pradesh

Updated On : April 4, 2024 / 11:22 PM IST

Earthquake : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. పట్టణం అంతటా, చంబా పట్టణానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.

భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు తెలిపింది. మనాలిలో చాలా బలమైన ప్రకంపనలు సంభవించాయని, దాదాపు ఏడు సెకన్ల పాటు భూమి కంపించిందని మనాలి స్థానికుడు ఒకరు చెప్పారు.

Read Also : Best Phones in India : ఈ ఏప్రిల్‌లో రూ.50వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇళ్లలోని వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, జనావాసాలు లేని ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లలేదు.

ఇదిలా ఉండగా, దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 4, 1905న సంభవించిన విధ్వంసకర భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 1న, హిమాచల్ ప్రదేశ్‌లోని చమోలీ, లాహౌల్, స్పితిలలో చిన్నపాటి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.

Read Also : Mosquito Bite : వేసవిలో దోమకాటు నివారణకు 9 అద్భుతమైన ఇంటి చిట్కాలివే!