Indian Millionaires : భారత్‌ను వదిలిపోతున్న మిలియనీర్లు .. 2023లో 6,500 మంది..!
భారత కుబేరులు దేశం వదిలిపోతున్నారు. ప్రతీ ఏటా భారత మిలియనీర్లు దేశం వదిలిపోతున్నారు. అలా ఈ ఏడాది భారీ సంఖ్యలో దేశం వదిలపోతున్నారని నివేదిక వెల్లడించింది.

Indian millionaires Go To dubai, Singapore
Indian millionaires Go To dubai, Singapore : భారత్ లో అపరకుబేరులు (Indian millionaires) దేశం వదిలిపోతున్నారు. దుబాయ్ (Dubai), సింగపూర్ (Singapore)వంటి దేశాలకు తరలిపోతున్నారు. ఇలా భారత్ ను వదిలిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఏకంగా 6,500 మంది దేశం వదిలిపోతున్నారని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు (Henley’s annual Private Wealth Migration Report )తాజాగా వెల్లడించింది. ఇటువంటి పరిస్థితి భారత్ లోనే కాదు మన పొరుగున ఉన్న చైనా (China)లో కూడా ఉంది. అలాగే బ్రిటన్ కూడా ఉంది. మిలియనీర్లు దేశం వదలిపోయే దాంట్లో మొదటిస్థానంలో చైనా ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది. మూడో స్థానంలో యూకే ఉంది.
2023లో దేశాన్ని వదిలిపోయేవారిలో చైనాలో 13,500మంది సంపన్నులు ఉండగా..యూకే (UK)లో 3,200మంది, అలాగే భారత్ లో 6500 మంది సంపన్నులు దేశాన్ని వీడనున్నారట. 2022లో భారత్ నుంచి 7,500మంది వీడారు.
2023లో 6,500 మంది హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (High Net Worth Individuals)( అంటే ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టగలిగిన సంపన్నులు)(HNWI) భారత్‌ను వీడే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది 13,500 మంది సంపన్న చైనీయులు దేశాన్ని వీడనుండగా సంపన్నుల వలసల్లో చైనా తొలి స్థానంలో నిలిచింది. అలాగే రష్యా, బ్రెజిల్ వంటి దేశాలల్లో కూడా ఇలా సంపన్నులు దేశం వీడుతున్నారని తెలుస్తోంది.
కానీ సంపన్నులు దేశ వీడిపోతున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..వెళ్లిపోతున్నవారి సంఖ్య కంటే కొత్త సంపన్నులు పుట్టుకొస్తున్నారని న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ (Head of Research New World Wealth) విభాగం హెడ్ ఆండ్రూ మోలిస్ (Andrew Amolis)తెలిపారు. కాగా ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టగలిగిన సంపన్నులను హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ అని అంటారు.
ఇలా సంపన్నులు భారత్ ను వీడి వెళ్లటానికి దేశంలో ఉన్న విధానాలు కూడా కారణంగా కనిపిస్తోంది. భారత్‌లోని సంక్లిష్ట పన్ను చట్టాలు (Tax laws), విదేశీ పెట్టుబడులకు (Foreign investments)సంబంధించి అస్పష్టమైన విధానాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉండటంతో భారతీయ సంపన్నులు విదేశాలకు తరలిపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
అలా దేశం వదిలివెళ్లే సంపన్నులు ఎక్కువ శాతం దుబాయ్ (
Dubai ), సింగపూర్ (Singapore)కు వెళుతున్నారని తెలుస్తోంది. కానీ ఈ సంవత్సరం మాత్రం వివిధ దేశాల సంపన్నులు ఆస్ట్రేలియాకు క్యూ కట్టే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు పేర్కొంది.