500-bed ICU Facility : రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ బెడ్లు.. 70శాతం పూర్తి.. మరికొన్ని రోజుల్లోనే సిద్ధం
కరోనా బాధితుల కోసం రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ బెడ్లతో సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ ఐసీయూ బెడ్ల నిర్మాణంలో 70శాతం పని పూర్తి అయిందని, మరికొన్ని రోజుల్లో అంతా సిద్ధం అవుతుందని అంటున్నారు అధికారులు.

Ramlila Maidan’s 500 Bed Icu Facility, To Be Ready In A Few Days
Ramlila Maidan’s 500-bed ICU facility : కరోనా బాధితుల కోసం రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ బెడ్లతో సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ ఐసీయూ బెడ్ల నిర్మాణంలో 70శాతం పని పూర్తి అయిందని, మరికొన్ని రోజుల్లో అంతా సిద్ధం అవుతుందని అంటున్నారు అధికారులు. రామ్ లీలా మైదానంలోని ఈ ఐసీయూ బెడ్ల సదుపాయాన్ని లోక్ నాయక్ ఆస్పత్రితో లింక్ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
లోక్ నాయక్, జీటీపీ ఆస్పత్రి సమీపంలోని రామ్ లీలా మైదానంలో వెయ్యి ఐసీయూ బెడ్లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు గత వారమే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లపై పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 29న సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ మైదానాన్ని సందర్శించారు. అనంతరం జైన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇది పరీక్షా కాలం.. మన ఇంజనీర్లు, వర్కర్లు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు..
మే 5లోగా ఐసీయూ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. ఏప్రిల్ నెలలో ఢిల్లీలో కరోనా కొత్త కేసులు 28వేల మార్క్ ను దాటేశాయి. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గురువారం రోజున నగరంలో కరోనా కేసులు 19,133 నమోదు కాగా.. 335 మరణాలు నమోదయ్యాయి.