ఓటు లేదని తెలిసి ఆమె గుండె ఆగిపోయింది

  • Published By: vamsi ,Published On : April 19, 2019 / 04:00 AM IST
ఓటు లేదని తెలిసి ఆమె గుండె ఆగిపోయింది

Updated On : April 19, 2019 / 4:00 AM IST

ఎన్నికల వేళ కొన్ని సంఘటనలు ఎలక్షన్ కమీషన్‌కు ఓట్లు గల్లంతవడం అనేది తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి ఘటనలు ఎన్నికల వేళ చోటు చేసుకున్నాయి. అయితే తన ఓటు గల్లంతవడంతో 74ఏళ్ల వృద్ధురాలు గుండె ఆగి చనిపోయింది. తమిళనాడులో 2వ విడత ఎన్నికల్లో భాగంగా.. ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు వచ్చింది.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

చెన్నై పుదుపేట తిరువెంకట వీధికి చెందిన సెచ్చిలి మోరాల్‌ తన ఓటు హక్కును వినియోగిందచుకునేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చింది. అయితే ఆమె ఓటు గల్లంతైనట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురై కుప్పకూలిపోయింది. ఎంతసేపు లేపడానికి ప్రయత్నించినా ఆమె లేవలేదు. అనంతరం ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. గత 56 ఏళ్లుగా పుదుపేటలో నివసిస్తున్న సెచ్చిలి మోరాల్‌ ఓటును అధికారులు తీసివేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స