TV Actress : విమానంలో నటితో వ్యాపారవేత్త అసభ్య ప్రవర్తన

విమానంలో టీవీ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నటి ఫిర్యాదుతో వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

TV Actress : విమానంలో నటితో వ్యాపారవేత్త అసభ్య ప్రవర్తన

Actress

Updated On : October 21, 2021 / 12:44 PM IST

businessman behaved rudely : విమానంలో టీవీ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నటి ఫిర్యాదుతో వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల కథనం ప్రకారం.. టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి అక్టోబర్‌ 3న విమానంలో ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లింది.

విమానం ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అవడంతో ఓవర్‌హెడ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన బ్యాగు తీసుకునేందుకు నటి సీటులో నుంచి పైకి లేచింది. అయితే పక్క సీట్లో ఉన్న ఓ వ్యాపారవేత్త నటి నడుం పట్టుకొని ఒక్కసారిగా ఒళ్లోకి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో బుకాయించాడు. పురుషుడు అనుకొని అలా చేశానని ఆమెకు క్షమాపణలు చెప్పాడు.

Ads : యాడ్స్ వల్ల ట్రోల్ల్స్ కి గురవుతున్న సెలెబ్రిటీలు

ఇంటికి వెళ్లిన టీవీ నటి జరిగిన విషయాన్ని విమానయాన సంస్థకు మెయిల్‌ చేశారు. సదరు వ్యక్తి వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. అయితే తాము అలా చేయలేమని.. విషయాన్ని పోలీసులకు తెలియజేయాలంటూ సంస్థ సూచించారు. దీంతో ఆమె అక్టోబర్‌ 4న ముంబయిలోని సహర్‌ పోలీసులకు నటి ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సదరు వ్యాపారవేత్తను పోలీసులు అక్టోబర్ 14న అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరుచగా.. మరో 24 గంటలపాటు కోర్టు కస్టడీ విధించింది.

Pakistan Slogans: ఉత్తరప్రదేశ్‌లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాధిత నటి విమానంలో జరిగిన విషయాలను బహిర్గతం చేశారు. నిందితుడి చర్యతో ఎంతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని వ్యాపారవేత్త కుటుంబసభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వాపోయారు. ఆ ఘటనతో వణికిపోయానని తెలిపారు.

సదరు వ్యాపారవేత్త భార్య, మరో వ్యక్తి తన ఇంటికి వచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తనను అడిగారని పేర్కొన్నారు. వారికి తన ఇంటి అడ్రస్‌ కూడా తెలిసిపోయిందన్నారు. మళ్లీ ఎవరైనా తన దగ్గరకు వస్తారేమోనని భయాందోళన వ్యక్తం చేశారు.