Anand Mahindra : ఆ రూమ్‌లో ఉండటానికి ఆనంద్ మహీంద్ర ఎందుకు భయపడుతున్నారు?
కొన్ని ప్రదేశాలు చూడటానికి ఎంత అద్భుతంగా కనిపిస్తాయో.. అక్కడికి వెళ్లి ఉండటానికి కాస్త భయం, సంకోచం కలిగిస్తాయి. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రని ఓ రూమ్ చాలా ఆకట్టుకుంది.. కానీ అక్కడికి వెళ్లి ఉండటానికి మాత్రం సంకోచం కలిగించింది.

Anand Mahindra
Anand Mahindra : కొండపైన అద్భుతంగా కట్టిన రూమ్. చూడటానికి వండర్ లాగ ఉంది. అసలే వర్షాకాలం.. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ రూమ్‌లో పడుకుంటే ఎలా ఉంటుంది? అని అందరం ఊహించుకుంటాం. కానీ అదే టైమ్‌లో అసలే కొండ.. వర్షాకాలం.. ఆ రూమ్‌లో ఉండటం ఎంతవరకూ సేఫ్? అనే డౌట్ కూడా వస్తుంది. ఇదే సంకోచం కలిగింది వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకి.. ఈ రూమ్ గురించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Anand Mahindra : మహిళ క్రియేటివిటీ నచ్చి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ కొండపై ఉన్న రూమ్‌లో ఉండటం అనేది ఎంతవరకూ సేఫ్ అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ కొండపై గాజు, ఉడ్‌తో నిర్మించిన అందమైన బెడ్ రూమ్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసిన ఆనంద్ మహీంద్ర ఇష్టపడ్డారు. తన ట్విట్టర్ ఖాతాలో (@anandmahindra) ఈ వీడియోను ‘ సాధారణంగా, నేను ఇలాంటి అందమైన డిజైన్‌లను చూసి ఆశ్చర్యపోతుంటాను, కానీ భారీ వర్షాల కారణంగా రాత్రి వేళ ఇలాంటి రూమ్‌లో ఉండగలనో లేదో ఖచ్చితంగా చెప్పలేను’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. ఈ వీడియోతో పాటు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
‘చూడటానికి అందంగా ఉన్నా.. అది ఉన్న విధానం చూస్తే నాకు భయం వేస్తోంది సార్’ అని ఒకరు.. ‘ఆ రూమ్ తయారు చేసిన చెక్క నాణ్యత, గాజు బలం గురించి నాకు భయంగానే ఉంది సార్’ అని మరొకరు కామెంట్లు చేసారు. నిజంగానే కొన్ని చూడటానికి అందంగా కనిపిస్తాయి. ప్రాక్టికల్ గా వెళ్లి ఉండటానికి కాస్త భయాన్ని, సంకోచాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు అదే భయం, సంకోచం చాలామందికి కలుగుతోంది. ఏది ఏమైనా ఆ నిర్మాణం మాత్రం అద్భుతంగా ఉందని.. వెళ్లి ఉండాలంటే జాగ్రత్తలు అవసరం అని సూచిస్తున్నారు. అది ఎక్కడ ఉందనే వివరాలు మాత్రం తెలియదు.
Ordinarily, I would have marveled at this beautiful design but with the unpredictable fury & impact of the rains now being evident around the world, I’m not sure I’d sign up for a night in this space! pic.twitter.com/ao9XC6EHxF
— anand mahindra (@anandmahindra) July 12, 2023