Student Stabbed Teacher : పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి

ఢిల్లీలోని ఇందర్ పురిలో దారుణం జరిగింది. పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి దాడి చేశాడు. కత్తిలో పలుమార్లు పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Student Stabbed Teacher : పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి

ATTACK

Updated On : January 19, 2023 / 7:54 PM IST

student stabbed teacher : ఢిల్లీలోని ఇందర్ పురిలో దారుణం జరిగింది. పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి దాడి చేశాడు. కత్తిలో పలుమార్లు పొడిచాడు. దీంతో ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందర్ పురిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. పరీక్షలను పరిశీలించేందుకు భూదేవ్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లాడు.

ఈ నేపథ్యంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి టీచర్ పై కత్తితో దాడి చేశాడు. అతన్ని పలుమార్లు కత్తితో పొడిచాడు. దీంతో టీచర్ భూదేవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆయనను వెంటనే బీఎల్ కే కపూర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు

టీచర్ పై కత్తితో దాడి చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అయితే టీచర్ పై దాడి చేసిన ఘటనలో మరో ఇద్దరు విద్యార్థుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.