కరోనా ఎప్పుడు అంతం అవుతుందో చెప్పిన..బాల జ్యోతిష్కుడు

  • Published By: madhu ,Published On : April 19, 2020 / 03:53 AM IST
కరోనా ఎప్పుడు అంతం అవుతుందో చెప్పిన..బాల జ్యోతిష్కుడు

Updated On : April 19, 2020 / 3:53 AM IST

బాల జ్యోతిష్కుడు…అభిజ్ణ ఆనంద్ ఇప్పుడు సంచలాత్మకంగా మారిపోయాడు. ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా వైరస్ పై ఏడాది క్రితమే వెల్లడించిన ఓ వీడియో బయటకు పొక్కడంతో..ఇతను ఫేమస్ అయ్యాడు. ఇతను ఇంకా ఎలాంటి విషయాలు చెబుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇతని గురించి..సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. కరోనా ఎప్పుడు అంతం అవుతుంది ? ఈ వైరస్ నుంచి విముక్తి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా..మరో వీడియో విడుదల చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. 

మే 29వ తేదీన కరోనా అంతం అవుతుందని తాను చెప్పిన దానిలో నిజం లేదని, అసలు విషయం ఏమిటంటే..మే 29వ తేదీ తర్వాత…కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని వెల్లడించాడు అభిజ్ణ. ఒకటి, రెండు రోజులు పరిస్థితి మాములుగానే ఉన్నా..మరల యదాస్థితికి చేరుకుంటుందని వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ ఎఫెక్ట్ జూన్ వరకు కొనసాగుతుందని వెల్లడించాడు. మే 29 నుంచి జూన్ చివరి వారం వరకు.. పరిస్థితి మెల్లిమెల్లిగా అదుపులోకి వస్తుందని తెలిపారు. జులై మొదటి వారానికి కొంచెం ఈ కరోనా నుంచి బయటపడొచ్చని చెప్పుకొచ్చాడు. 

కరోనా వైరస్ ఆర్థిక రంగంపై ఎలాంటి  ప్రభావం చూపిస్తుందో తెలియచేశాడు. ఎకానమి పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం లేదని తెలిపాడు. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా కుదుటపట్టడానికి జులై తర్వాత..ఆర్నెళ్లు పడుతందని చెప్పాడు. 

Also Read | కేసులు పెరుగుతున్నాయి..హైదరాబాద్ వాసులు..బీ అలర్ట్ – కేసీఆర్