Ankita Bhandari Murder Case : అంకిత భండారి హత్య కేసు .. నార్కో పరీక్షకు అంగీకరించని నిందితులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరాఖండ్, రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసులో నార్కో పరీక్షకు నిందుతులు నిరాకరించారు.నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షను కోరుతూ వేసిన పిటిషన్‌లో స్పష్టత లేదని డిఫెన్స్ న్యాయవాది అమిత్ సజ్వాన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) భావనా ​​పాండే విచారణను వాయిదా వేశారు.

Ankita Bhandari Murder Case :  అంకిత భండారి హత్య కేసు .. నార్కో పరీక్షకు అంగీకరించని నిందితులు

receptionist Ankita Bhandari murder refused to undergo narco test

Updated On : December 23, 2022 / 1:13 PM IST

Ankita Bhandari murder case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరాఖండ్, రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసులో నార్కో పరీక్షకు నిందుతులు నిరాకరించారు.నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షను కోరుతూ వేసిన పిటిషన్‌లో స్పష్టత లేదని డిఫెన్స్ న్యాయవాది అమిత్ సజ్వాన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) భావనా ​​పాండే విచారణను వాయిదా వేశారు. నిందితులకు నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షల కోసం ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన అఫిడవిట్ లో స్పష్టత లేదని తెలిపారు. తదుపరి విచారణను జనవరి 3(2023)కు వాయిదా వేశారు.

కాగా ఉత్తరాఖండ్‌లోని వంటారా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న అంకిత భండారిని యజమాని, మేనేజర్, సిబ్బంది కలిసి వ్యభిచారంలోకి దింపాలని ప్రయత్నించారు. దీనికి ఆమె నిరాకరిచింది. దీంతో ఈ విషయం ఆమె బయటపెడతుందని భయంతో ఆమెను ఒక కాలువ వద్దకు తీసుకెళ్లి హత్య చేసారు. ఆమె మృతదేహం బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

అలాగే ఈ హత్యలో రిసార్ట్ మేనేజర్ సహా మరొకరి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య స్థానిక బీజేపీ నేత కుమారుడు. గత సెప్టెంబర్ 18న అంకితను హత్య చేయగా, ఆమె మృతదేహం సెప్టెంబర్ 24న బయటపడింది.

ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో కేసుకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. మరింత బలమైన ఆధారాలు సేకరించే ఉద్దేశంతో పోలీసులు నిందితులకు నార్కో టెస్ట్ నిర్వహించాలనుకుని కోర్టుకు దరఖాస్తు చేశారు. కోర్టు అనుమతి రాగానే నిందితులకు నార్కో పరీక్ష నిర్వహించాలనుకున్నారు. కానీ నిందితులు కూడా నార్కో పరీక్షకు నిరాకరించారు. ఈక్రమంలో పిటీషన్ లో స్పష్టతలేదని డిఫెన్స్ న్యాయవాది అమిత్ సజ్వాన్ అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) భావనా ​​పాండే విచారణను వాయిదా వేశారు.

ఈ విషయంపై డిషెన్స్ న్యాయవాది అమిత్ సజ్వాన్ మాట్లాడుతూ “నిందితులకు నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలను కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టత లేదని..నిందితులకు నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. అయితే వారికి నార్కో టెస్ట్ కావాలా లేక పాలిగ్రాఫ్ టెస్ట్ కావాలా లేక రెండూ కావాలా అనేది మాత్రం చెప్పలేదు. వారు ఏ ప్రయోజనం కోసం కోరుకుంటున్నారో కూడా చెప్పలేదు ”అని విచారణ తరువాత మీడియాకు వెల్లడించారు.