గుజరాత్ కంపెనీకి పార్లమెంట్ బిల్డింగ్ పునరుద్దరణ కాంట్రాక్ట్

పార్లమెంట్ భవన్నాన్ని రీ డిజైన్ చేసే కాంట్రాక్ట్ ను గుజరాత్ కు చెందిన సంస్థ దక్కించుకుంది. భీమా పటేల్ కు చెందిన అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే HCP డిజైన్ ప్లానింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు దక్కింది. అంచనా వ్యయం 448కోట్లు కంటే తక్కువగా 229.7కోట్లకే ఈ కాంట్రాక్టు హెచ్ సీపీ కంపెనీ దక్కించుకున్నట్లు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్ దీప్ పూరి తెలిపారు. కన్సల్టింగ్ కాస్ట్ మొత్తం కాస్ట్ లో 3-5శాతం వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
ఐకానిక్ ప్రణాళికలో భాగంగా కొత్త లుక్ కోసం వారసత్వ భవనాలను ఇందులో చేర్చడం లేదని మంత్రి చెప్పారు. 250ఏళ్ల వరకు అవసరాలు తీర్చగలిగే విధంగా నిర్మాణం జరుగుతదని ఆయన తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు విస్తరించి ఉండి,నెలకు రూ.1,000 కోట్లు అద్దెకు ఖర్చు చేస్తున్నందున కొత్త కేంద్ర సచివాలయ భవనం ఇందులో ఉంటుందని ఆయన తెలిపారు. 2022ఆగస్టు నాటికి పార్లమెంట్ బిల్డింగ్ రీడెవలప్ మెంట్ పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
గతంలో ఈ కంపెనీ గాంధీనగర్ లోని సెంట్రల్ విస్తా,సబర్మతి నది ఒడ్డుని రీడెవలప్ మెంట్ చేసిన చరిత్ర ఉంది.