Karnataka Hijab Row: యూనిఫామ్ విశిష్టత అల్ ఖైదాకు అర్ధంకాక పోవచ్చు కానీ భారతీయ ముస్లింలకు తెలుసు: అస్సాం సీఎం

తీవ్రవాది అల్ జవహరి వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంతా బిస్వా స్పందిస్తూ..ఎవరో ఎదో చెప్పారని భారత్ లోని ముస్లింలు చట్టాన్ని అగౌరపరిచే స్థితిలో లేరని అన్నారు

Karnataka Hijab Row: యూనిఫామ్ విశిష్టత అల్ ఖైదాకు అర్ధంకాక పోవచ్చు కానీ భారతీయ ముస్లింలకు తెలుసు: అస్సాం సీఎం

Uniform

Updated On : April 7, 2022 / 9:27 AM IST

Karnataka Hijab Row: కర్ణాటక రాష్ట్రంపై హిజాబ్ వివాదంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. రాష్ట్ర హైకోర్ట్ తీర్పుతో సద్దుమణిగిందనుకున్న వివాదం..ఏదో ఒక కారణంతో తిరిగి వార్తల్లో నిలుస్తుంది. కర్ణాటక హిజాబ్ వివాదంపై అల్ ఖైదా చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఐమన్ అల్ జవహిరి స్పందిస్తూ..హిజాబ్ హక్కుపై ఎదురొడ్డి నిలిచిందంటూ ముస్కాన్ ఖాన్ అనే యువతి పేరును ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిజాబ్ వివాదంపై సాధారణంగానే స్పందించాల్సినా జవహరి ప్రత్యేకించి ఒక యువతి పేరును ప్రస్తావించడం వెనుక కుట్రదాగి ఉందని అర్ధం అవుతుంది. ఇక తీవ్రవాది అల్ జవహరి వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంతా బిస్వా స్పందిస్తూ..ఎవరో ఎదో చెప్పారని భారత్ లోని ముస్లింలు చట్టాన్ని అగౌరపరిచే స్థితిలో లేరని అన్నారు.

Also read:russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

చట్టాల విలువ అల్ ఖైదా లాంటి తీవ్రవాదులకు తెలియకపోయినా..భారతీయ ముస్లింలకు తెలుసనీ సీఎం హిమంతా బిస్వా అన్నారు. విద్యాసంస్థల్లో యూనిఫామ్ ధరించే విధంగా కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు కట్టుబడి..విద్యార్థులు నిర్దేశిత యూనిఫామ్ ధరిస్తారని..యూనిఫామ్ విలువ అల్ ఖైదా తీవ్రవాదులకు తెలియకపోయినా..మన భారతీయ ముస్లిం విద్యార్థులకు తెలుసనీ సీఎం హిమంతా అన్నారు. విద్యాసంస్థల్లో మతపరమైన వస్త్రధారణకు అవకాశం కల్పిస్తే.. ఇకపై అవి మతపరమైన ప్రవర్తన ప్రదర్శనకు నిలయం అవుతాయని సీఎం హిమంతా బిస్వా ఆందోళన వ్యక్తం చేశారు.

Also read:Karnataka: పండ్ల వ్యాపారంపై హిందూ జన జాగృతి సమితి సంచలన పిలుపు

“మీరు హిజాబ్ ధరిస్తే, నేను ఇంకేదైనా ధరిస్తాను అనే ధోరణి విద్యార్థుల్లో కనిపిస్తుంది, అప్పుడు పాఠశాల మరియు కళాశాల మతపరమైన దుస్తులు మరియు మత ప్రవర్తనల ప్రదర్శనకు వేదికగా మారతాయి. అటువంటప్పుడు పాఠశాల మరియు కళాశాలల్లో హిజాబ్‌ను ఎలా అనుమతిస్తారు. అందుకే యూనిఫాం అనే పదం వచ్చింది. యూనిఫామ్ లో ఉంటే హిందువులు, ముస్లింలు..పేద, ధనిక అనే తేడా ఉండదు” అంటూ సీఎం హిమంతా బిస్వా శర్మ అన్నారు. సామాజికంగా ప్రజలు ఎలా ఉన్నా..దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అంశాల్లో చట్టానికి కట్టుబడి ఉండాలని సీఎం హిమంతా వ్యాఖ్యానించారు.