UP : అక్టోబర్ 18 వరకు పోలీసులకు సెలవులు లేవు!
అనివార్య పరిస్థితుల్లో మాత్రమే లీవు అనుమతించబడుతుందని, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Up Police
UP Policemen : ఏ సమస్య వచ్చినా వారు ముందుంటారు. శాంతిభద్రతలకు, ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వారే పోలీసులు. వీరికి కూడా సెలవులు ఉంటాయి. కానీ పరిస్థితిని బట్టి వీరి లీవులు మారుతుంటాయి. ఏదైనా సమస్య వస్తే..మాత్రం లీవ్ లు రద్దు చేస్తూ..అక్కడి రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయాలు తీసుకుంటుంటుంది. దీంతో వారు విధులు నిర్వహిస్తుంటారు. తాజాగా…యూపీ పోలీసు శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రాబోయే పండుగలు, రైతుల నిరసలను దృష్టిలో ఉంచుకుని..లీవులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read More : Uttarakhand Politics : దేవభూమిలో కమలానికి బిగ్ షాక్..కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మంత్రి..మరో ఎమ్మెల్యే కూడా
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో లఖింపూర్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసేందే. ఎక్కడికక్కడే ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. లఖింపూర్ లో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నలుగురు రైతులు చనిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులను బహిరంగంగా బెదిరించారని, మంత్రి కుమారుడే తమపైకి వాహనం నడిపాపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు, రైతులు ఆందోళన చేపడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని…అక్టోబర్ 18వ తేదీ వరకు యీపీ పోలీసులకు ఎలాంటి లీవులు ఉండవని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Read More : Maharashtra Bandh : మహారాష్ట్రలో కొనసాగుతున్న బంద్, 8 బస్సులు ధ్వంసం!
అనివార్య పరిస్థితుల్లో మాత్రమే లీవు అనుమతించబడుతుందని, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రామ్ లీలా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మతపరమైన ప్రదేశాలు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా పలు నిరసనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 12వ తేదీన సమావేశానికి రావాలని రైతులకు కిసాన్ మోర్చా సూచించింది. అదే రోజున సాయంత్రం క్యాండిల్ మార్చ్, దిష్టి బొమ్మల దహనం చేయాలని పిలుపునిచ్చింది. అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకోలు చేయాలని కిసాన్ మోర్చా వెల్లడించింది. దీంతో పోలీసుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.