Rajasthan Cabinet : రాజస్తాన్ లో కీలక పరిణామం..మంత్రులందరూ రాజీనామా

రాజస్తాన్ లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 7గంటల సమయంలో జైపూర్ లో సీఎం అశోక్​ గహ్లోత్

Rajasthan Cabinet : రాజస్తాన్ లో కీలక పరిణామం..మంత్రులందరూ రాజీనామా

Skm (1)

Updated On : November 20, 2021 / 9:06 PM IST

Rajasthan Cabinet రాజస్తాన్ లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్​వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 7గంటల సమయంలో జైపూర్ లో సీఎం అశోక్​ గహ్లోత్ నివాసంలో భేటీ అయిన మంత్రులు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మంత్రుల రాజీనామాను సీఎం గహ్లోత్ ఆమోదించారు. మరికొద్ది సేపట్లో గవర్నర్​ను గహ్లోత్​ కలవనున్నారు. ఇక,ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ అదిష్టానం..కొత్త మంత్రి వర్గ జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది.

రాజస్తాన్‌ గవర్నర్‌ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. అదేరోజున మధ్యాహ్యాం 2గంటలకు పీసీసీ సమావేశం కూడా జరగనుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

అయితే,శుక్రవారమే ముగ్గురు రాజస్తాన్ మంత్రులు-రెవ‌న్యూశాఖ మంత్రి హ‌రీశ్ చౌద‌రీ, వైద్య‌శాఖ మంత్రి ర‌ఘు శ‌ర్మ‌, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోస్తారాలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ రాజీనామా లేఖను సోనియాగాంధీకి కూడా పంపించారు. ఇక,శనివారం వీరి రాజీనామాలను సీఎం గహ్లోత్ ఆమోదించారు. కాగా, గోవింద్‌ సింగ్‌ రాజస్థాన్ పీసీసీ అధ్యక్షునిగా ఉండగా.. మిగితా ఇద్దరిలో  రఘుశర్మ, హరీష్‌ చౌదరీలు గుజరాత్‌, పంజాబ్‌ పార్టీ వ్యవహారాల బాధ్యులుగా నియమితులయ్యారు.

మరోవైపు, పార్టీ హైకమాండ్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ వర్గానికి ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం అశోక్‌ గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసి మాట్లాడారు. శాసనసభలో ఉన్న 200మంది సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో గరిష్ఠంగా 30మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది.

ALSO READ New Power Bill : విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి…రాష్ట్రాలపై ఒత్తిడి వద్దు