US Deportation News : ఇంకో 487 మంది.. ఇల్లీగల్ గా ఉంటున్న ఇండియన్స్ ను పంపేస్తున్న అమెరికా..

2009 నుండి మొత్తం 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారతదేశానికి పంపేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు.

US Deportation News : ఇంకో 487 మంది.. ఇల్లీగల్ గా ఉంటున్న ఇండియన్స్ ను పంపేస్తున్న అమెరికా..

Updated On : February 7, 2025 / 9:31 PM IST

US Deportation News : అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లిన భారతీయులను తిరిగి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అక్రమ వలసదారులను భారత్ కు పంపేసింది అగ్రరాజ్యం అమెరికా. తాజాగా మరో 487 మందిని గుర్తించింది. వారంతా యూఎస్ లో ఇల్లీగల్ గా ఉంటున్నట్లు గుర్తించిన అమెరికా అధికారులు.. భారత్ కు తిప్పి పంపేస్తున్నారు.

మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులు గుర్తింపు..
దీనికి సంబంధించి కేంద్రం ఒక ప్రకట చేసింది. అమెరికాలో నివసిస్తున్న మరో 487 మంది అక్రమ భారతీయ వలసదారులను అక్కడి అధికారులు గుర్తించారని, వారిని త్వరలో బహిష్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారతీయ పౌరుల గురించి న్యూఢిల్లీకి అమెరికా తెలియజేసిందని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. కాగా, ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుతం డిపోర్టేషన్ జాబితాలో 487 మంది వలసదారులు ఉన్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది.

Also Read : కాళ్లు, చేతులకు సంకెళ్లతోనే టాయిలెట్ వెళ్లాం.. అలానే తిన్నాం.. 51 గంటలు నరకయాతన.. కైతాల్ యువకుడి కన్నీటి వ్యథ..!

కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి..
104 మంది బహిష్కరించబడిన వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం జనవరి 5న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. కాగా, అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించిన తమను తిప్పి పంపే ప్రయత్నంలో తమ చేతులు, కాళ్ళకు సంకెళ్లు వేశారని బాధితులు వాపోయారు. ఇది అత్యంత అమానుషం అని కన్నీటిపర్యంతం అయ్యారు.

Also Read : రతన్ టాటా వీలునామాలో షాకింగ్ పేరు? ఎవరీ మోహిని మోహన్ దత్తా.. ఈ మిస్టరీ మ్యాన్‌కు రూ. 500 కోట్లు రాసిచ్చాడు!

బహిష్కరణ కొత్తేమీ కాదు.. ఎప్పటి నుంచో అమల్లో ఉంది..
2009 నుండి మొత్తం 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారతదేశానికి పంపేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు. కాగా, బహిష్కరణకు గురైన వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై రాజ్యసభలో ఆయన కీలక ప్రకటన చేశారు. బహిష్కరణ ప్రక్రియ చాలా సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఇది కొత్తది కాదని స్పష్టం చేశారు. బహిష్కరణలు.. ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు ద్వారా నిర్వహించబడతాయి, అమలు చేయబడతాయన్నారు.