Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు టైం మిషన్‌ కావాలట! ఎందుకో తెలుసా?

ఆనంద్‌ మహీంద్రా తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో 1903 నాటి ముంబై తాజ్‌ హోటల్‌ చిత్రాన్ని షేర్‌ చేశారు. దేశంలోని అత్యుత్తమ హోటల్లో ముంబై తాజ్‌ ఒకటి. ఈ హోటల్ ను 1903 డిసెంబర్‌ 1 ఓపెన్‌ చేశారు. ఆ సమయంలో తాజ్‌లో ఒక్కరోజు స్టే చేయడం కోసం అయ్యే ఖర్చు కేవలం 6 రూపాయలు మాత్రమే. తాజ్‌ హోటల్‌ ఓపెనింగ్‌ బ్రోచర్‌ను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు టైం మిషన్‌ కావాలట! ఎందుకో తెలుసా?

Anand Mahindra

Updated On : August 7, 2021 / 6:11 PM IST

Anand Mahindra : మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఎదో ఒక సమాచారాన్ని ప్రజలతో పంచుకుంటుంటారు. అయితే కొద్దీ రోజులుగా పాతకాలం నాటి విషయాలపై దృష్టిపెట్టినట్లు ఉన్నారు మహీంద్రా.. కొద్దిరోజుల క్రితం 1900లోని వాహనాలు, వాటి ధరలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక తాజాగా ఇటువంటిదే మరో ట్విట్‌ చేశారు. తనకు ఆర్జెంటుగా టైం మిషన్‌ కావాలని రాసుకొచ్చారు. టైం మిషన్‌ను ఉపయోగించి వెంటనే భూతకాలానికి వెళ్లాలని తన ట్విట్‌లో తెలిపారు.

అసలు టైం మెషిన్ ఎందుకు?

ఆనంద్‌ మహీంద్రా తాజాగా తన ట్విటర్‌ ఖాతాలో 1903 నాటి ముంబై తాజ్‌ హోటల్‌ చిత్రాన్ని షేర్‌ చేశారు. దేశంలోని అత్యుత్తమ హోటల్లో ముంబై తాజ్‌ ఒకటి. ఈ హోటల్ ను 1903 డిసెంబర్‌ 1 ఓపెన్‌ చేశారు. ఆ సమయంలో తాజ్‌లో ఒక్కరోజు స్టే చేయడం కోసం అయ్యే ఖర్చు కేవలం 6 రూపాయలు మాత్రమే. తాజ్‌ హోటల్‌ ఓపెనింగ్‌ బ్రోచర్‌ను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ప్రస్తుత కాలం నుంచి భూతకాలానికి వెళ్లేందుకు ఒక టైం మిషన్ కావాలని రాసుకోవచ్చారు. టైం మిషన్ దొరికితే 1903కి వెళ్లి తాజ్ హోటల్ లో స్టే చేయాలనుకుంటున్నారు ఆనంద్ మహేంద్రా. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజ్ హోటల్ లో స్టే చెయ్యాలంటే రోజుకు రూ.15 వేల నుంచి 18 వేల వరకు ధర పలుకుతుంది.