Parliament Winter Session: పార్లమెంట్ నుంచి మరో ఇద్దరు ఎంపీలు ఔట్.. 143కు చేరిన సస్సెన్షన్

దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్‌సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.

Parliament Winter Session: పార్లమెంట్ నుంచి మరో ఇద్దరు ఎంపీలు ఔట్.. 143కు చేరిన సస్సెన్షన్

Updated On : December 20, 2023 / 3:36 PM IST

పార్లమెంట్ లో లోపాలపై కొనసాగుతున్న గందరగోళం నేపథ్యంలో మరో ఇద్దరు ఎంపీలు సస్సెండ్ అయ్యారు. బుధవారం, సభ ధిక్కరణ కేసులో ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సీ.థామస్, ఏఎం ఆరిఫ్‌లను పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 143కి చేరింది.

మంగళవారం ఒక్కరోజే 49 మంది ఎంపీలను లోక్‌సభ మొత్తం సెషన్‌కు సస్పెండ్ చేశారు. దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్‌సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.

నిజానికి డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన వార్షికోత్సవం సందర్భంగా ఇద్దరు యువకులు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి నేలపైకి దూకడంతో పార్లమెంట్ భద్రతలో పెద్ద లోపం వెలుగు చూసింది. ఈ సందర్భంగా డబ్బా నుంచి పొగలు వ్యాపించాయి. ఇంతలో, మరో ఇద్దరు పార్లమెంటు కాంప్లెక్స్‌లో డబ్బాల ద్వారా ఎరుపు, పసుపు పొగను వ్యాపించారు. దీనిపై విపక్షాలు పట్టబట్టాయి. ఈ నేపథ్యంలోనే సభ్యులను సస్పెండ్ చేశారు.